Breaking News

స్టాక్‌ మార్కెట్‌ క్లోజింగ్‌ ఆక్షన్‌ సెషన్‌.. సెబీ కొత్త ప్రతిపాదనలు

Published on Sun, 09/13/2026 - 12:08

స్టాక్‌ మార్కెట్‌లో ఇటీవల ప్రవేశపెట్టిన క్లోజింగ్‌ ఆక్షన్‌ సెషన్‌ (CAS) కారణంగా ఎక్స్‌పైరీ రోజున డెరివేటివ్స్‌ సెటిల్‌మెంట్‌ ధరల నిర్ణయంపై తలెత్తిన ఆందోళనలకు పరిష్కారం చూపేందుకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) కీలక మార్పులను ప్రతిపాదించింది. ఇండెక్స్‌, సింగిల్‌ స్టాక్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల ఎక్స్‌పైరీ సెటిల్‌మెంట్‌ ధరను ఎలా నిర్ణయించాలన్న అంశంపై రెండు ప్రత్యామ్నాయాలను సూచించింది. ఈ ప్రతిపాదనలపై మార్కెట్‌ భాగస్వాములు అక్టోబర్‌ 3 వరకు తమ అభిప్రాయాలను సమర్పించవచ్చు.

సీఏఎస్‌తో వచ్చిన మార్పులపై సమీక్ష

ఈక్విటీ క్యాష్‌ మార్కెట్‌లో సీఏఎస్‌ను సెబీ గత ఆగస్టు 3 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. షేర్లకు మరింత పారదర్శకంగా క్లోజింగ్‌ ప్రైస్‌ నిర్ణయించడమే దీని ప్రధాన ఉద్దేశం. అయితే ఎక్స్‌పైరీ రోజుల్లో సీఏఎస్‌ సమయంలో ఇండెక్స్‌ ఆప్షన్స్‌లో భారీగా ట్రేడింగ్‌ జరగడం, ఇండెక్స్‌ స్థాయిల్లో హెచ్చుతగ్గులు కనిపించడంతో డెరివేటివ్స్‌ సెటిల్‌మెంట్‌ ధరపై మార్కెట్‌ భాగస్వాములు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ప్రస్తుత విధానాన్ని సమీక్షించనున్నట్లు సెబీ ఇటీవల ప్రకటించింది.

రెండు సెటిల్‌మెంట్‌ విధానాలు

బ్లెండెడ్‌ వీవ్యాప్‌: ఈ విధానంలో సాధారణ నిరంతర ట్రేడింగ్‌ సెషన్‌ (CTS) చివరి 30 నిమిషాల్లో జరిగిన లావాదేవీలతో పాటు, 10 నిమిషాల సీఏఎస్‌లో జరిగిన ట్రేడ్లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. రెండు సెషన్లలో జరిగిన వాస్తవ ట్రేడింగ్‌ వాల్యూమ్‌ ఆధారంగా వాటికి వెయిటేజీ ఇచ్చి సెటిల్‌మెంట్‌ ధరను నిర్ణయిస్తారు.

సీటీఎస్‌ వీవ్యాప్‌: ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్ని కొనసాగించడం మరో ప్రత్యామ్నాయం. అంటే సాధారణ ట్రేడింగ్‌ సెషన్‌లో చివరి 30 నిమిషాల్లో జరిగిన లావాదేవీల వాల్యూమ్‌ వెయిటెడ్‌ యావరేజ్‌ ప్రైస్‌ (VWAP) ఆధారంగానే డెరివేటివ్స్‌ ఎక్స్‌పైరీ సెటిల్‌మెంట్‌ ధరను నిర్ణయిస్తారు.

ఏడాది పాటు ప్రస్తుత విధానమే?

సీఏఎస్‌ కొత్త వ్యవస్థ కావడంతో మార్కెట్‌ పాల్గొనేవారికి దానిపై మరింత అవగాహన రావడానికి సమయం ఇవ్వాలని సెబీ భావిస్తోంది. అందువల్ల వెంటనే బ్లెండెడ్‌ వీవ్యాప్‌కు మారకుండా, కనీసం ఏడాది పాటు సీటీఎస్‌ వీవ్యాప్‌ను కొనసాగించి, ఆ తర్వాత సీఏఎస్‌లో లిక్విడిటీ, భాగస్వామ్యం, వివిధ మార్కెట్‌ పరిస్థితుల్లో వేలం పనితీరును సమీక్షించి బ్లెండెడ్‌ వీవ్యాప్‌కు మారే అవకాశాన్ని పరిశీలించాలని ప్రతిపాదించింది.

ఇండెక్స్‌ వ్యాల్యూ ప్రదర్శనకు బ్రేక్‌?

సీఏఎస్‌ సమయంలో కనిపించే ఇండికేటివ్‌ ఇండెక్స్‌ వాల్యూ (IIV)పై కూడా సెబీ కీలక ప్రతిపాదన చేసింది. వేలంలో ఉన్న ఆర్డర్ల ఆధారంగా రూపొందే ఇండికేటివ్‌ ఈక్విలిబ్రియం ప్రైస్‌ (IEP) వాస్తవంగా జరిగిన ట్రేడ్‌ ధర కాదని, అందువల్ల దాని ఆధారంగా రూపొందే ఇండెక్స్‌ విలువను కూడా వాస్తవ మార్కెట్‌ స్థాయిగా భావించే అవకాశం ఉందని సెబీ పేర్కొంది.

ఈ నేపథ్యంలో సీఏఎస్‌ సమయంలో ఐఈపీ ఆధారంగా రూపొందే ఇండికేటివ్‌ ఇండెక్స్‌ వాల్యూను ప్రదర్శించకుండా ఉండే అవకాశం ఉంది. అయితే వ్యక్తిగత షేర్లకు సంబంధించిన ఐఈపీలను మాత్రం కొనసాగించాలని ప్రతిపాదించింది.

మార్కెట్‌ టైమింగ్స్‌లోనూ మార్పుల ప్రతిపాదన

సెటిల్‌మెంట్‌ విధానంతో పాటు సీటీఎస్‌, సీఏఎస్‌, డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌ మధ్య సమయ సమన్వయాన్ని కూడా సెబీ పునఃపరిశీలిస్తోంది. ఇందులో రెండు టైమింగ్‌ ఆప్షన్లను ప్రతిపాదించింది. ఒకదానిలో సీఏఎస్‌కు ముందు సీటీఎస్‌ను 3:30 గంటల వరకు, ఎఫ్‌&వో ట్రేడింగ్‌ను 3:45 గంటల వరకు కొనసాగించే విధానం ఉంది. మరోదానిలో సీటీఎస్‌ను 3:15 గంటలకు, ఎఫ్‌&వోను 3:30 గంటలకు ముగించే అవకాశం ఉంది.

అదేవిధంగా సీఏఎస్‌ ముగిసిన తర్వాత డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌ వ్యవధిని ఐదు నిమిషాలకు పరిమితం చేయడం, సెషన్ల మధ్య మార్పు సమయాన్ని ఒక నిమిషానికి తగ్గించడం వంటి ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. సీఏఎస్‌లో రిఫరెన్స్‌ ధరకు ±1 శాతానికి మించి ఉన్న లిమిట్‌ ఆర్డర్లను రద్దు చేయడంపై పరిమితులు, ధరను మెరుగుపరిచే దిశలో మాత్రమే మార్పులకు అనుమతి ఇవ్వడం వంటి చర్యలను కూడా సెబీ పరిశీలిస్తోంది.

Videos

10 వేలతో 9 లక్షల లాభం.. HDFC Flexi Cap Fund రికార్డ్ రిటర్న్స్

జగన్ లేకపోతే నేను లేను.. అందరి ముందు కన్నీళ్లు పెట్టుకున్న బద్దుకొండ అప్పలనాయుడు

2లక్షలు వసూలు చేసిన హిజ్రాలపై కేసు

చేసిందంతా ఆ ఇద్దరే! జూడో అసోసియేషన్ లీలలు

ముంచుకొస్తున్న 76 కిలోమీటర్ల ఉపద్రవం.. నాసా కెమెరాకు చిక్కిన సాక్ష్యం

పుష్ప రేంజ్ లో ఛేజింగ్.. పరారైన స్మగ్లర్లు

స్పిరిట్ ని తొక్కండి చూద్దాం... క్రిటిక్స్ కు వంగా తమ్ముడు సవాల్

భక్తుల దర్శనానికి సిద్ధమైన ఖైరతాబాద్ గణేషుడు

వాళ్ళు నా దగ్గర డబ్బు తీసుకుని ఒక్కటే హామీ ఇచ్చారు.. బాధితుడు షాకింగ్ నిజాలు

కార్యకర్తల కోసం కదిలిన జగనన్న.. గోల్డ్, సిల్వర్ కార్డ్స్

Photos

+5

'మండాడి' సినిమా సక్సెస్ మీట్ (ఫోటోలు)

+5

విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం...చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫొటోలు)

+5

వినాయక చవితి రోజు తప్పక సమర్పించాల్సిన 21 పత్రాలు.. (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత.. ఈ ఫోటోలు చూశారా?

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (సెప్టెంబర్ 13 -సెప్టెంబర్ 19)

+5

'ఎపిక్' షూటింగ్‌లో ఆనంద్-వైష్ణవి గ్యాంగ్ ఇలా (ఫొటోలు)

+5

వినాయకుడికి ఇష్టమైన 10 ప్రసాదాలు... మీరు ఓ లుక్ వేయండి (ఫొటోలు)

+5

సమంత స్టన్నింగ్‌ లుక్స్‌ అదుర్స్‌ (ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహాగణపతి ఆగమన కార్యక్రమం (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)