Breaking News

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. దూసుకెళ్లిన ఎస్‌బీఐ

Published on Fri, 10/10/2025 - 15:39

దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ఫార్మా, బ్యాంకింగ్ షేర్లలో లాభాల కారణంగా ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు వరుసగా రెండవ ట్రేడింగ్ సెషన్‌లోనూ ఎగువన ముగిశాయి.

ఐటీ స్టాక్స్ బలహీనత మధ్య 100 పాయింట్ల క్షీణతతో 82,075 వద్ద ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్ వెంటనే పుంజుకుంది. ఇంట్రా-డే డీల్స్ లో 579 పాయింట్లు పెరిగి 82,654 వద్ద గరిష్ట స్థాయికి ర్యాలీ చేసింది. ఎట్టకేలకు 329 పాయింట్లు లేదా 0.4 శాతం లాభంతో 82,501 వద్ద ముగిసింది.

ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 25,331 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 104 పాయింట్లు లేదా 0.4 శాతం పెరిగి 25,285 వద్ద స్థిరపడింది. ఈ ప్రక్రియలో ఎన్ఎస్ఈ బెంచ్ మార్క్ ఇండెక్స్ జూన్ 27 నుండి అతిపెద్ద వారాంతపు లాభాన్ని (1.6 శాతం) నమోదు చేయగలిగింది.

సెన్సెక్స్ స్టాక్స్ లో ఎస్బీఐ 2 శాతానికి పైగా లాభపడింది. మారుతి సుజుకి, యాక్సిస్ బ్యాంక్, ఎటర్నల్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ 1 శాతం లాభపడ్డాయి. మరోవైపు టాటా స్టీల్ 1.5 శాతం పడిపోయింది.

క్యూ2 ఫలితాలను నివేదించిన తర్వాత టీసీఎస్ కూడా ఒక రోజు 1 శాతం తగ్గింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.4 శాతం, స్మాల్ క్యాప్ 0.6 శాతం పెరిగాయి.

రంగాలవారీగా.. బీఎస్ఈ హెల్త్‌కేర్, బ్యాంకెక్స్ ఒక్కొక్కటి 1 శాతం వరకు పెరిగాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్ ఒక్కొక్కటి 0.5 శాతం లాభపడ్డాయి. 2030 నాటికి భారత్-బ్రిటన్ వాణిజ్యం రెట్టింపు అవుతుందనే వార్తల మధ్య ఇంట్రాడే డీల్స్ లో టెక్స్ టైల్ కంపెనీల షేర్లు 17 శాతం వరకు పెరిగాయి.

#

Tags : 1

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)