Breaking News

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Published on Mon, 07/07/2025 - 15:43

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ట్రంప్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోని దేశాలకు ఆగస్టు 1 నుంచి సుంకాలు అమలు చేస్తామని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ప్రకటించపడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో భారత ఈక్విటీ బెంచ్‌మార్క్‌ సూచీలు  ఫ్లాట్‌గా స్థిరపడ్డాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ 9.61 పాయింట్లు (0.01 శాతం) స్వల్పంగా లాభపడి 83,442.50 వద్ద ముగియగా, నిఫ్టీ 50 25,461.3 స్థాయిలో ముగిసింది. విస్తృత మార్కెట్లలో ఎన్ఎస్ఈ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.27 శాతం, ఎన్ఎస్ఈ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.44 శాతం నష్టపోయాయి.

నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 1.68 శాతం లాభపడగా, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, డాబర్ ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్, ఇమామీ, బ్రిటానియా, వరుణ్ బేవరేజెస్ షేర్లు లాభపడ్డాయి. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, నిఫ్టీ ఎనర్జీ కూడా గ్రీన్‌లో స్థిరపడ్డాయి. నిఫ్టీ ఐటీ, మెటల్, బ్యాంక్, ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఫార్మా షేర్లు నష్టాల్లో ముగిశాయి.

భారత్ ఎలక్ట్రానిక్స్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్, హెచ్‌సీఎల్ టెక్, మారుతి, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ 2.4 శాతం వరకు నష్టపోయాయి. మరోవైపు హెచ్‌యూఎల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ట్రెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, అదానీ పోర్ట్స్ 3 శాతం వరకు లాభపడ్డాయి.

Videos

విచారణకు మిథున్ రెడ్డి.. సిట్ ఆఫీస్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు

నీ అంతుచూస్తా.. రేయ్ ఏంట్రా నీ ఓవర్ యాక్షన్ అన్న జేసీ ప్రభాకర్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్

కేసులకు భయపడే ప్రసక్తే లేదు: పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి

పెద్దమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నాం.. గాలి భాను ప్రకాష్ ను ఏకిపారేసిన మహిళలు

ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

క్రికెట్ లోనూ ఇంతేనా? తమిళ కుర్రాడిపై ఢిల్లీ పెద్దల కుట్రలు

నా ఫ్యామిలీ జోలికొస్తారా.. ఏ ఒక్కరిని వదలను

తల్లిని దూషిస్తే ఎవరూ ఊరుకోరు.. ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప..

గుదిబండగా మారిన నాలుగు కుంకీ ఏనుగులు

Photos

+5

కొంపల్లిలో సందడి చేసిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఐఎన్‌ఎస్‌ నిస్తార్‌ జాతికి అంకితం (ఫొటోలు)

+5

ట్రైలర్ లాంచ్ ఈవెంటో మెరిసిన నటి డింపుల్ హయాతీ (ఫొటోలు)

+5

విజయవాడ : సారె తెచ్చి..మనసారా కొలిచి..కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

జడివానకు హైదరాబాద్‌ అతలాకుతలం.. ట్రాఫిక్‌ జామ్‌తో చుక్కలు చూసిన వాహనదారులు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన..చెరువుల్లా మారిన రోడ్లు (ఫొటోలు)

+5

‘నా సీతా సీమంతం’ శ్రీమతి సీమంతంపై బిగ్‌బాస్‌ ఫేం పోస్ట్‌ (ఫొటోలు)

+5

‘నేను నా శివయ్య’ అంటున్న ఈ భక్తురాల్ని చూశారా?

+5

చందమామలా.. చీర సింగారించుకుని క్యూట్‌గా తెలుగు బ్యూటీ!

+5

ఆంధ్రా సరిహద్దులో.. ఉరకలేస్తున్న జలపాతాలు(చిత్రాలు)