Breaking News

మహిళల​​కు ఎస్‌బీఐ ట్రైనింగ్‌..

Published on Wed, 01/29/2025 - 17:23

ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) మహిళలకు సాధికారత కల్పించే దిశగా వారికోసం ప్రత్యేకంగా రూపొందించిన శిక్షణా కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. 153 గ్రామీణ స్వయం సమృద్ధి శిక్షణా కేంద్రాల్లో (RSET) దీన్ని ప్రారంభించింది. దీనితో 5,200 మందికి ప్రయోజనం చేకూరగలదని బ్యాంకు తెలిపింది.

ఇందులో భాగంగా టైలరింగ్, ఫుడ్‌ ప్రాసెసింగ్, వర్మికల్చర్‌ మొదలైన 27 అంశాల్లో శిక్షణా మాడ్యూల్స్‌ ఉంటాయని వివరించింది. ట్రైనింగ్‌తో పాటు ఆర్థికంగా సహాయం పొందడం, మార్కెట్‌ లింకేజీలు మొదలైన విషయాల్లోనూ మార్గదర్శకత్వం లభించగలదని బ్యాంకు పేర్కొంది. ప్రారంభ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శైలేష్‌ కుమార్‌ సింగ్, ఎస్‌బీఐ చైర్మన్‌ సీఎస్‌ శెట్టి వర్చువల్‌గా పాల్గొన్నారు.

మహిళా సాధికారతకు కృషి
దేశవ్యాప్తంగా స్వయం ఉపాధిని ప్రోత్సహించడంలో ఎస్‌బీఐ గ్రామీణ స్వయం సమృద్ధి శిక్షణా కేంద్రాల్లో కీలకంగా కృషి చేస్తున్నాయి. ప్రారంభం నుండి ఈ కేంద్రాలు దాదాపు 46,818 శిక్షణా కార్యక్రమాల ద్వారా సుమారు 12.74 లక్షల మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చాయి. వీరిలో 74% మంది అభ్యర్థులు స్వయం ఉపాధిని సాధించారు. దేశ జీడీపీకి మహిళలు దాదాపు 18 శాతం సహకారం అందిస్తున్న నేపథ్యంలో మహిళా సాధికారతను మరింత పెంచాల్సిన అవసరం ఉంది.

దేశంలోని మహిళల వ్యవస్థాపకత కలలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణనీయంగా సహాయం చేసింది. స్వయం-సహాయక సమూహాల మహిళలకు అందించిన రుణాల్లో రూ.50,000 కోట్లకు పైగా సహాయంతో ఎస్బీఐ ముందంజలో ఉంది. ఆయా స్వయం-సహాయక సమూహాల్లోని సుమారు కోటి మంది మహిళల జీవితాలలో మార్పు తీసుకురావడంలో కృషి చేసింది. ఎస్‌బీఐ ద్వారా అందిస్తున్న సామాజిక భద్రతా పథకాలలో మహిళల భాగస్వామ్యం 50% కంటే ఎక్కువగా ఉంది. ఇక కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద బ్యాంకు చేపడుతన్న కార్యక్రమాల్లో మహిళా సాధికారత కీలకమైన అంశంగా ఉంది.

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)