Breaking News

వ్యాపార విధానాలను స్టార్టప్స్‌ మెరుగుపర్చుకోవాలి

Published on Thu, 07/20/2023 - 06:08

న్యూఢిల్లీ: నిధుల లభ్యత తగ్గిపోయిన నేపథ్యంలో అంకుర సంస్థలు ఆర్థికంగా మరింత మెరుగైన వ్యాపార విధానాలను పాటించాల్సిన అవసరం నెలకొందని, ఖర్చులను తగ్గించుకోవాల్సి ఉంటుందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆర్థిక పరిస్థితులు, వేల్యుయేషన్ల ప్రభావంతో పెట్టుబడుల ప్రవాహం మందగించడంతో స్టార్టప్‌లు పలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయని బిజ్‌2క్రెడిట్‌ వ్యవస్థాపకుడు రోహిత్‌ ఆరోరా తెలిపారు. 2023లో దేశీ స్టార్టప్‌లలోకి విదేశీ పెట్టుబడులు 72 శాతం పడిపోయాయని ఆయన వివరించారు.

అయితే, ఆర్థికంగా నిలదొక్కుకుని, ఈ పరిస్థితి నుంచి బైటపడటంపై అంకుర సంస్థలు దృష్టి పెట్టాల్సి ఉందని ఆరోరా తెలిపారు. అంతర్జాతీయంగా గత కొంతకాలంగా ఎదురైన చేదు అనుభవాల కారణంగా వెంచర్‌ క్యాపిటల్, ప్రైవేట్‌ ఈక్విటీ ఇన్వెస్టర్లు నమ్మకం కాస్త దెబ్బతిందని ప్రాప్‌టెక్‌ సంస్థ రెలాయ్‌ వ్యవస్థాపకుడు అఖిల్‌ సరాఫ్‌ అభిప్రాయపడ్డారు. దీంతో డీల్స్‌ విషయంలో వారు ఆచి తూచి వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా ఇటీవలి నివేదిక ప్రకారం భారతీయ స్టార్టప్‌ వ్యవస్థలోకి ఈ ఏడాది పెట్టుబడులు 36 శాతం క్షీణించాయి. గతేడాది ప్రథమార్ధంలో 5.9 బిలియన్‌ డాలర్లు రాగా ఈసారి 298 డీల్స్‌ ద్వారా రూ. 3.8 బిలియన్‌ డాలర్లు వచ్చాయి.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)