Breaking News

స్టార్‌షిప్ లాంచ్ రీ-షెడ్యూల్

Published on Mon, 07/20/2026 - 11:14

టెక్సాస్‌లోని బోకా చికా లాంచ్ ప్యాడ్ నుంచి ప్రపంచంలోనే శక్తివంతమైన రాకెట్‌ల్లో ఒకటైన స్పేస్‌ఎక్స్ ‘స్టార్‌షిప్’ ప్రయోగానికి సంబంధించి ఉత్కంఠ నెలకొంది. జులై 16న ప్రయోగానికి కేవలం కొన్ని సెకన్ల ముందే కౌంట్‌డౌన్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి రీ-షెడ్యూల్ తేదీపై సంస్థ అధికారిక ప్రకటనకు, ఎలాన్ మస్క్ చేసిన సోషల్ మీడియా పోస్టుకు మధ్య స్వల్ప వ్యత్యాసం కనిపించడం ఇప్పుడు చర్చకు దారితీసింది.

స్పేస్‌ఎక్స్ సంస్థ విడుదల చేసిన అధికారిక నివేదిక ప్రకారం.. తదుపరి లాంచ్ ప్రయత్నాన్ని గురువారం (జులై 23) చేపట్టాలని భావిస్తున్నారు. అయితే, సంస్థ అధినేత ఎలాన్ మస్క్ తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ తదుపరి ప్రయోగం శుక్రవారం (జులై 24) ఉండొచ్చని పేర్కొని ఆ వెంటనే ‘అంటే నా ఉద్దేశం గురువారమే’ అని సవరించుకున్నారు. ఈ చిన్నపాటి గందరగోళం ఎలా ఉన్నా జులై 23 లేదా 24 తేదీల్లో ఈ రాకెట్ నింగిలోకి ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది.

చివరి క్షణంలో ఎందుకు ఆగింది? కారణాలు ఇవే..

స్పేస్‌ఎక్స్ ప్రయోగించిన సరికొత్త వర్షన్-3 (V3) మోడల్‌కు చెందిన ఈ 13వ టెస్ట్ ఫ్లైట్ జులై 16న ప్రయోగించాల్సింది. దాదాపు 1.15 కోట్ల పౌండ్ల ద్రవ మిథేన్, ద్రవ ఆక్సిజన్‌ను రాకెట్‌లో నింపినప్పటికీ ఇంజిన్ స్టార్టప్ సీక్వెన్స్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. సూపర్ హెవీ బూస్టర్‌లోని మొత్తం 33 రాప్టర్-3 ఇంజిన్లలో నాలుగు అనుకున్న సమయానికి ఇగ్నైట్ (మండటం) కాలేదు. దీనితో ఆటోమేటెడ్ సేఫ్టీ సిస్టమ్ ప్రయోగాన్ని తక్షణమే నిలిపివేసింది.

ఈ వైఫల్యం కారణంగా మార్కెట్లో స్పేస్‌ఎక్స్ విలువపై దాదాపు 100 బిలియన్ డాలర్ల ప్రభావం పడినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, ఇలాంటి భారీ ప్రయోగాల్లో ఇది సర్వసాధారణమని అంతరిక్ష నిపుణులు చెప్తున్నారు. ఇంజిన్ల వైఫల్యంపై స్పేస్‌ఎక్స్ బృందం వేగంగా స్పందించింది. రాకెట్ ప్రొపల్షన్ సిస్టమ్‌లో మార్పులు చేయడంతో పాటు లోపభూయిష్టంగా ఉన్న 2 రాప్టర్ ఇంజిన్లను తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చినట్లు స్పేస్‌ఎక్స్ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: హోమ్ లోన్ కడుతూ అద్దె ఇంట్లో ఉంటున్నారా?

ఈ ప్రయోగం ప్రత్యేకత ఏంటి?

  • సుమారు 15 బిలియన్ డాలర్ల వ్యయంతో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్టు ద్వారా మానవాళిని చంద్రుడిపైకి, ఆపై అంగారకుడిపైకి తీసుకెళ్లాలన్నదే మస్క్ ఆశయం.

  • ఈ ప్రయోగంలో 20 అధునాతన స్టార్‌లింక్ శాటిలైట్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లి వాటి శాటిలైట్ డిస్పెన్సింగ్ సిస్టమ్, లేజర్ కమ్యూనికేషన్ లింకులను పరీక్షించనున్నారు.

  • భూ వాతావరణంలోకి ఈ ఉపగ్రహాలు తిరిగి ప్రవేశించినప్పుడు సబ్‌ఆర్బిటల్ గమనాన్ని కూడా నిశితంగా పరిశీలిస్తారు.

  • గతంలో లాగా సంస్థ ఈసారి బూస్టర్‌ను భూమిపైకి తెచ్చి క్యాచ్ పట్టే ప్రయత్నం చేయడం లేదు. కేవలం ఇంజిన్ల పనితీరు, అంతరిక్షంలో రాప్టర్ ఇంజిన్ల రీ-లైట్ సామర్థ్యాలపైనే ప్రధాన దృష్టి పెట్టారు.

  • కొన్ని మార్పులతో సిద్ధమైన స్టార్‌షిప్ అమెరికా కాలమానం ప్రకారం జులై 23 సాయంత్రం వేళ నింగిలోకి దూసుకెళ్లేందుకు కౌంట్‌డౌన్ సిద్ధమవుతోంది.

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)