Breaking News

బంగారం.. భలే లాభం! ఆర్బీఐ గుడ్‌న్యూస్‌

Published on Wed, 06/10/2026 - 16:39

బంగారంలో పెట్టుబడి పెట్టిన వారికి సావరిన్‌ గోల్డ్‌ బాండ్లు (SGB) మరోసారి భారీ లాభాలను అందించాయి. 2019-20 సిరీస్‌–VII కింద జారీ చేసిన ఎస్‌జీబీల ముందస్తు రిడెంప్షన్‌ (Premature Redemption) ధరను భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గ్రాముకు రూ.15,275గా నిర్ణయించింది.

ఆర్బీఐ ఈ బాండ్లను 2019 డిసెంబర్‌ 10న గ్రాముకు రూ.3,745 ధరతో జారీ చేసింది. అప్పుడు వీటిని కొనుగోలుచేసినవారికి ఐదేళ్లలో సుమారు 308 శాతం లాభం లభించినట్లైంది. అంటే గ్రాముకు రూ.11,530 లాభం అన్నమాట. అలాగే ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేసిన గ్రాముకు రూ.50 తగ్గింపు కూడా ఆర్బీఐ ఇచ్చింది. దీంతో ఆన్‌లైన్‌లో కొన్నవారికి ఈ లాభం 313 శాతానికి పైగా చేరింది.

రూ.లక్షకు రూ.4 లక్షలు!

ఈ సిరీస్‌లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారుల పెట్టుబడి విలువ ప్రస్తుతం రూ.4.08 లక్షలకు పైగా పెరిగినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీనికి అదనంగా బాండ్‌ జారీ ధరపై సంవత్సరానికి 2.5 శాతం స్థిర వడ్డీని కూడా అర్ధవార్షికంగా పొందారు. అంటే మొత్తం రాబడి ఇంకా ఎక్కువే.

రిడెంప్షన్‌ ధర ఎలా నిర్ణయించారు?

ఎస్‌జీబీ రిడెంప్షన్‌ ధరను ఇండియా బులియన్‌ అండ్‌ జ్యువెలర్స్‌ అసోసియేషన్‌ (IBJA) ప్రకటించే 999 స్వచ్ఛత బంగారం ముగింపు ధరల ఆధారంగా నిర్ణయిస్తారు. జూన్‌ 5, 8, 9 తేదీల ముగింపు ధరల సగటు ఆధారంగా ఈ విడతకు గ్రాముకు రూ.15,275 ధరను ఖరారు చేసినట్లు ఆర్బీఐ తెలిపింది.

ఐదేళ్ల తర్వాతే ముందస్తు నిష్క్రమణ

సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల అసలు గడువు ఎనిమిదేళ్లు. అయితే జారీ తేదీ నుంచి ఐదో సంవత్సరం పూర్తైన తర్వాత వడ్డీ చెల్లింపు తేదీల్లో ముందస్తుగా బాండ్లను రిడీమ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా ఈ సిరీస్‌కు జూన్‌ 10, 2026 తేదీని అర్హత కలిగిన రిడెంప్షన్‌ తేదీగా ఆర్బీఐ ప్రకటించింది.

పన్ను ప్రయోజనాలు ఏమిటి?

వ్యక్తిగత పెట్టుబడిదారులు ఎస్‌జీబీలను ఆర్బీఐ వద్ద రిడీమ్‌ చేసుకున్నప్పుడు లభించే మూలధన లాభాలపై గతంలో పన్ను మినహాయింపు ఉండేది. అయితే 2026 బడ్జెట్‌ తర్వాత పన్ను నిబంధనల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ వడ్డీ ఆదాయం మాత్రమే ఆదాయపు పన్నుకు లోబడి ఉంటుంది. బాండ్ల బదిలీ ద్వారా వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలకు ఇండెక్సేషన్‌ ప్రయోజనాలు వర్తిస్తాయి.

ఏమిటీ ఎస్‌జీబీ పథకం?

భౌతిక బంగారం కొనుగోలు అవసరం లేకుండా బంగారం ధరల పెరుగుదల ప్రయోజనం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో ఈ పథకాన్ని ప్రారంభించింది. బంగారం ధరల పెరుగుదలతో పాటు 2.5 శాతం వార్షిక వడ్డీ కూడా లభించడం ఈ పథకాన్ని ప్రత్యేకంగా నిలిపింది. దేశంలో భౌతిక బంగారం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, గృహ పొదుపులను ఆర్థిక ఆస్తులుగా మలచడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు.

అయితే ప్రభుత్వం 2023 చివరి నుంచి కొత్త సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల జారీని నిలిపివేసింది. నిర్వహణ వ్యయాలు పెరగడం, గోల్డ్‌ ఈటీఎఫ్‌లు, డిజిటల్‌ గోల్డ్‌ వంటి ప్రత్యామ్నాయాల ప్రాచుర్యం పెరగడం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంది. అయితే ఇప్పటికే జారీ చేసిన బాండ్లు చెల్లుబాటులోనే ఉంటాయి. పెట్టుబడిదారులు వాటిని మెచ్యూరిటీ వరకు కొనసాగించవచ్చు లేదా అర్హత వచ్చినప్పుడు ముందస్తు రిడెంప్షన్‌ను ఎంచుకోవచ్చు.

ఇదీ చదవండి: ఈజీగా ‘EPF 100% విత్‌డ్రా’.. కొత్తగా మారిందిదే..

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)