Breaking News

నక్క తోక తొక్కిన ‘గోల్డ్‌ బాండ్లు’.. రూ.100కు రూ.325

Published on Thu, 10/23/2025 - 17:33

ముంబై: సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGB) 2017–18 సిరీస్ IVలో పెట్టుబడిపెట్టినవారు ఇప్పుడు పండుగ చేసుకుంటున్నారు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గ్రాముకు రూ.12,704 తుది రిడంప్షన్ ధరను ప్రకటించింది. అంటే 8 సంవత్సరాల కాలంలో 325 శాతం రాబడిని వస్తోందన్నమాట.

వాస్తవానికి అక్టోబర్ 2017లో గ్రాముకు రూ.2,987 వద్ద జారీ చేసిన బాండ్లు ఇ‍ప్పుడు రూ. 9,717 లాభాన్ని ఇచ్చాయి. దీనికి ఆర్నెళ్లకోసారి చెల్లించే 2.5% వార్షిక వడ్డీ అదనం. 2025 అక్టోబర్ 17, 20, 22 తేదీల్లో ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రచురించిన బంగారం సగటు ముగింపు ధర (999 స్వచ్ఛత) ఆధారంగా రిడంప్షన్ ధరను నిర్ణయించారు.

దిగుమతులను తగ్గించడంతోపాటు.. బంగారంపై పెట్టుబడులను డిజిటల్‌వైపు మళ్లించే లక్ష్యాలతో తీసుకొచ్చిందే సావరీన్‌ గోల్డ్‌ బాండ్‌ పథకం. పసిడిపై పెట్టుబడులను డిజిటల్‌ రూపంలోకి మళ్లించడంలో కేంద్రం ఒక విధంగా సక్సెస్‌ అయింది. కానీ, బంగారం దిగుమతులు మాత్రం తగ్గలేదు.

ఎస్‌జీబీలకు (Sovereign Gold Bonds ) ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రభుత్వ హామీతో కూడిన సాధనం కావడంతో పెట్టుబడులకు ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. దీంతో ఎస్‌జీబీల రూపంలో ప్రభుత్వంపై చెల్లింపుల భారం పెరిగిపోయింది. దీంతో సావరిన్‌ గోల్డ​్‌ బాండ్ల జారీని ప్రభుత్వం నిలిపేసింది.

సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌లు అందుబాటులో లేనప్పటికీ డిజిటల్‌ గోల్డ్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికీ ఇప్పటికీ ఇతర మార్గాలు ఉ‍న్నాయి. అవే గోల్డ్‌ ఈటీఎఫ్‌లు (Gold Exchange Traded Funds - Gold ETFs). వీటిని మ్యూచువల్ ఫండ్ సంస్థలు జారీ చేస్తాయి. వీటిలో పెట్టిన పెట్టుబడులు స్టాక్‌ ఎక్స్చేంజ్‌లలో షేర్లలా ట్రేడ్ అవుతాయి. గోల్డ్‌ ఈటీఎఫ్‌ ధర బంగారం మార్కెట్ ధరకు నేరుగా అనుసంధానమై ఉంటుంది. బంగారం ధర పెరిగితే, ఈటీఎఫ్‌ యూనిట్‌ విలువ కూడా పెరుగుతుంది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)