‘ఏంటి మేడమ్‌ ఇది.. పసిడి పన్ను న్యాయమేనా?’

Published on Thu, 02/05/2026 - 15:32

దేశ ప్రజలను భౌతిక బంగారం నుంచి పేపర్‌ గోల్డ్‌ వైపు మళ్లించేందుకు ఒకప్పుడు ఫ్లాగ్‌షిప్ పథకంగా నిలిచిన సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) ఇప్పుడు ఆర్థిక బిల్లులో ప్రతిపాదించిన కొత్త పన్ను మార్పుల నేపథ్యంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. సంవత్సరాల తరబడి పన్ను-సమర్థ పెట్టుబడిగా ప్రచారం చేసిన ఈ బాండ్లపై ఇప్పుడు ప్రభుత్వ విధాన స్థిరత్వమే ప్రశ్నార్థకంగా మారిందని విమర్శకులు అంటున్నారు.

ఈ నేపథ్యంలో పెట్టుబడిదారుల అసంతృప్తికి స్వరం ఇచ్చారు చార్టర్డ్ అకౌంటెంట్ కరణ్ భాల్. ఆయన సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారి తీశాయి. “వావ్! ఇప్పుడు PPF, EPF ఉపసంహరణల్లో కూడా ప్రభుత్వానికి వాటా కావాలా? NPS లాభాలపై కూడా పన్నా? ‘నువ్వు డబ్బు సంపాదిస్తే, నాకూ వాటా ఎందుకు వద్దు?’ అనడం ఇది ఏం లాజిక్‌ మేడమ్? (ఆర్థిక మంత్రి నిర్మిలా సీతారామన్‌), ఎలాంటి పన్ను సమస్యలు లేకుండా గోల్డ్‌ బాండ్‌లు కొనాలని మీ ప్రభుత్వమే చెప్పింది. పెట్టుబడిదారులు లాభపడితే విధానాలనే మార్చేస్తారా?” అంటూ భాల్ మండిపడ్డారు.

గోల్డ్‌ బాండ్‌ కొత్త ట్యాక్స్‌ ఫ్రేమ్‌వర్క్
ఆర్థిక బిల్లులో ప్రతిపాదించిన మార్పుల ప్రకారం.. ఇకపై సావరిన్ గోల్డ్ బాండ్‌లపై పన్ను విధానం ఇన్వెస్టర్‌ దాన్ని ఎప్పుడు, ఎలా కొనుగోలు చేశారు, ఎప్పుడు నిష్క్రమించారు అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. లాంచ్ సమయంలో చందా పొంది, పూర్తి 8 సంవత్సరాల మెచ్యూరిటీ వరకు ఉన్నవారికి  మాత్రమే ఇప్పటికీ మూలధన లాభాలపై పన్ను మినహాయింపు ఉంటుంది.

అదే సెకండరీ మార్కెట్లో సావరిన్ గోల్డ్ బాండ్‌లను కొనుగోలు చేసినవారికి మూలధన లాభాలపై పన్ను వర్తిస్తుంది. అలాగే, అసలు చందాదారులు ఐదేళ్ల తర్వాత కానీ ఎనిమిదేళ్లకు ముందే కానీ రీడీమ్ చేస్తే వారికి కూడా పన్ను వర్తిస్తుంది.

2015లో ప్రారంభమైన సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ పథకం ఇప్పటివరకు  67 విడతల్లో సుమారు 147 టన్నుల బంగారానికి బాండ్‌లు జారీ చేసింది. అయితే బంగారం ధరలు పెరగడంతో, 2024 తర్వాత కొత్తగా వీటి జారీని నిలిపేసింది. దీంతో  సెకండరీ మార్కెట్లో లావాదేవీలు పెరిగాయి. అవే ఇప్పుడు పన్నుల వలలో చిక్కాయి.

మరోవైపు రిస్క్ తీసుకున్నప్పటికీ తమ మొత్తం పోర్ట్‌ఫోలియో XIRRలు (ఎక్స్‌టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్) ఇప్పటికీ ప్రారంభ రెండంకెల్లోనే ఉన్నాయని, ఈటీఎఫ్‌లతో పోలిస్తే సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌లకు సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ సమస్యలు ఎక్కువ అని సీఏ కరణ్ భాల్  వాదిస్తున్నారు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)