Breaking News

సోనా కామ్‌స్టర్‌ ఛైర్మన్‌ మృతి

Published on Fri, 06/13/2025 - 11:56

ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త, నటి కరిష్మా కపూర్‌ మాజీ భర్త సుంజయ్ కపూర్(53) జూన్ 12, 2025న యూకేలో పోలో ఆడుతూ గుండెపోటుతో మరణించారు. ఆయన ఆకస్మిక మరణంపట్ల పరిశ్రమ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. సోనా బీఎల్‌డబ్ల్యూ కామ్‌స్టర్‌ సంస్థ(ప్రస్తుతం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.31,073 ​కోట్లు)కు ఛైర్మన్‌గా ఆటోమోటివ్ రంగంపై సుంజయ్‌ కపూర్‌ చెరగని ముద్ర వేశారు. ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) కాంపోనెంట్స్, డ్రైవ్‌లైన్‌ సిస్టమ్స్‌లో కీలక సంస్థగా సోనా కామ్‌స్టర్‌ను తీర్చిదిద్దారు. ఆయన తన నాయకత్వంతో కంపెనీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు.

గ్లోబల్‌గా విస్తరణ

సంజయ్‌ కపూర్‌ 2015లో తన తండ్రి సురీందర్ కపూర్ నుంచి కంపెనీ బాధ్యతలు స్వీకరించారు. తర్వాత సుంజయ్ వ్యూహాత్మకంగా సోనా కామ్‌స్టర్‌ సర్వీసులను అంతర్జాతీయంగా విస్తరించారు. ట్రాక్షన్ మోటార్లు, స్టార్టర్ మోటార్లు, అధునాతన డ్రైవ్‌లైన్‌ సొల్యూషన్లలో కంపెనీ స్థానాన్ని బలోపేతం చేశారు. అతని దూరదృష్టితో కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల కాంపోనెంట్స్‌ తయారు చేయడంలో కీలకంగా వ్యవహరించారు. దాంతో సంస్థ ప్రపంచ ఆటోమొబైల్‌ ఎకోసిస్టమ్‌లో ఒక ముఖ్యమైన సరఫరాదారుగా మారింది.

తదుపరి తరం మొబిలిటీ పరిష్కారాలు

సంజయ్‌ నాయకత్వంలో సోనా కామ్‌స్టార్‌ దేశ ఎలక్ట్రిక్ వాహనాల సరఫరా గొలుసును బలోపేతం చేయడమే కాకుండా యూరప్‌, ఉత్తర అమెరికా, ఆసియా అంతటా ప్రధాన ఆటోమోటివ్ తయారీదారులకు కీలక భాగస్వామిగా మారింది. సుస్థిరత, సాంకేతిక పురోగతి పట్ల ఆయన నిబద్ధత తదుపరి తరం మొబిలిటీ పరిష్కారాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది.

ఇదీ చదవండి: ప్చ్‌.. బంగారం తులం లకారం.. హ్యాట్రిక్‌!

పరిశ్రమ నాయకత్వానికి సహకారం

భారత ఆటో కాంపోనెంట్ రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఏసీఎంఏ) అధ్యక్షుడిగా పని చేశారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) మాన్యుఫాక్చరింగ్ కౌన్సిల్‌కు అధ్యక్షత వహించారు. సృజనాత్మకత, స్థానికీకరణ, ఎగుమతి వృద్ధిని ప్రోత్సహించడంపై దృష్టి సారించారు. తయారీదారులు, సరఫరాదారులకు ఒకే విధంగా ప్రయోజనం చేకూర్చేలా పని చేశారు.

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)