Breaking News

ఇన్వెస్టర్లను భయపెడుతున్న నాలుగు పదాల ట్వీట్

Published on Sat, 08/10/2024 - 15:13

ఇటీవల కుప్ప కూలిన స్టాక్ మార్కెట్లు ఇప్పుడిప్పుడే లాభాల బాటలో నడుస్తున్నాయి. ఈ తరుణంలో అమెరికా ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్ సంస్థ 'హిండెన్‌బర్గ్ రీసెర్చ్' చేసిన ఓ ట్వీట్ చాలామందిలో ఆందోళన కలిగిస్తోంది. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటి? దాని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో 'సమ్‌థింగ్‌ బిగ్‌ సూన్‌ ఇండియా' అని ట్వీట్ చేసింది. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. హిండెన్‌బర్గ్ మరోసారి భారతీయ మార్కెట్లలో బాంబు పేల్చనుందా.. అని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఏ కంపెనీ మీద నివేదికల విడుదల చేస్తుందో అని చర్చించుకుంటున్నారు.

హిండెన్‌బర్గ్ 2023 జనవరిలో అదానీ గ్రూప్ తమ కంపెనీ కంపెనీ షేర్స్ కృత్రిమంగా పెంచినట్లు ఓ నివేదికలో వెల్లడించింది. దీంతో అదానీ గ్రూప్ షేర్స్ ఒక్కసారిగా పడిపోయాయి. ఈ ఆరోపణలు సరైనవి కాదని, అదానీ గ్రూప్ ఖండించింది. ఆ తరువాత ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచడానికి అనేక చర్యలు తీసుకుంది. మొత్తానికి అదానీ గ్రూప్ మళ్ళీ యధాస్థితికి వచ్చింది.

ఇప్పుడు హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన నాలుగు పదాల ట్వీట్.. మళ్ళీ అదానీ గ్రూపును ఉద్దేశించి చేసిందా అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఈ ట్వీట్ అంతరార్ధం మాత్రం అవగతం కావడం లేదు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అనేది 2017లో ప్రారంభమైన ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్ కంపెనీ. ఈ కంపెనీలో ప్రస్తుతం 10మంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)