Breaking News

సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఓనర్‌.. ఇప్పుడు ఫుడ్‌డెలివరీ బాయ్‌..

Published on Thu, 06/12/2025 - 15:59

మనం రోజూ ఎంతో మంది చిరు ఉద్యోగులను చూస్తుంటాం. ముఖ్యంగా ఫుడ్‌ డెలివరీ సిబ్బందిగా చాలా మంది ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి వారిని కొంత మంది చిన్నచూపు చూస్తారు. కానీ వారి నేపథ్యాలు తెలిస్తే పశ్చాత్తాపడక తప్పదు. అలాంటి వారిలో ఒకరే పద్మనాభన్‌.

బెంగళూరుకు చెందిన నితిన్‌ కుమార్‌ ఫుడ్‌ కోసం స్విగ్గీలో ఆర్డర్‌ పెట్టారు. ఆర్డర్ అతని ఇంటి ముంగిటకు వచ్చినప్పుడు, తాను ఆహారాన్ని మాత్రమే ఆశించగా అతన్ని లోతుగా కదిలించే కథ పరిచయమైంది. కేవలం బతడం కోసమే కాకుండా ఒకప్పుడు తాను నడుపుతున్న వ్యాపారాన్ని పునరుద్ధరించుకునేందుకు ఫుడ్‌ డెలివరీలు చేస్తున్న పద్మనాభన్ అనే ఎంట్రప్రెన్యూర్‌ పరిచయమయ్యారు. ఆయన కథనే నితిన్ కుమార్ ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు.

"ఇదితో నా స్విగ్గీ డెలివరీ పార్టనర్ ఇది నాకు అప్పగించారు" అంటూ పోస్ట్‌ను ప్రారంభించిన నితిన్ కుమార్ దానికి ఓ రెజ్యుమ్‌ మొదటి పేజీ చిత్రాన్ని జతచేశారు. ‘డెలివర్డ్‌ విత్‌ కర్‌, బట్‌ విత్‌ కోడ్‌’ అని రెజ్యుమ్‌పై క్యాప్షన్‌ ఉంది. డెలివరీ పార్ట్‌నర్‌ పద్మనాభన్‌దే ఆ రెజ్యుమ్‌.  అందులో "19+ సంవత్సరాల అనుభవం ఉన్న ఫుల్-స్టాక్ డెవలపర్" అని ఆయన వృత్తిపరమైన సమాచారం ఉంది.

పద్మనాభన్ ఒకప్పుడు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీని నడిపారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా క్లయింట్స్ ఉండేవారు. కానీ ఆయనిప్పుడు ఫుడ్‌ డెలివరీ ఉద్యోగం చేస్తున్నారు. అయితే తాను ఈ పని చేస్తున్నది "మనుగడ కోసం మాత్రమే కాదు, (తన వ్యాపారాన్ని) మొదటి నుండి నిర్మించడానికి" ఆయన రెజ్యూమ్ హైలైట్ చేస్తోంది.

👉ఇదీ చదవండి: అప్పుడు రూ.1.25 లక్షల జీతం.. ఇప్పుడు ఫుడ్‌ డెలివరీ ఉద్యోగం..

డెలివరీ బాయ్‌కు బదులుగా మరేదైనా మంచి ఉద్యోగం ఇప్పించమంటావా అని అడిగితే.. ‘వద్దు, నా వ్యాపారాన్ని తిరిగి ట్రాక్‌లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను‘ అంటూ పద్మనాభన్‌ బదులిచ్చాడని నితిన్‌ కుమార్‌ పేర్కొన్నారు. కాగా పద్మనాభన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, ఆయన 2018లో తమిళనాడులో తన సంస్థను స్థాపించాడు. టెక్కీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లో డిగ్రీ చేశారు.
 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)