‘వాటిపై ఆసక్తి ఏది?’.. స్మృతి ఇరానీ ఆవేదన

Published on Sat, 12/16/2023 - 10:38

ముంబై: మహిళల ఆధ్వర్యంలో నడిచే వినూత్నమైన స్టార్టప్‌లకు మద్దతుగా నిలవకపోవడం పట్ల వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్స్‌ (వీసీ) తీరును కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రశ్నించారు. ‘నేటికీ పురుషుల ఆధ్వర్యంలోని కంపెనీలతో పోలిస్తే మహిళల ఆధ్వర్యంలోని స్టార్టప్‌ కంపెనీలపై వెంచర్‌ క్యాపిటలిస్ట్‌లు ఆసక్తి చూపడంలేదు’ అని మెంటార్‌ మైబోర్డ్‌ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఇరానీ పేర్కొన్నారు.

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో ఎంతో మంది మహిళా ఆవిష్కర్తలు ఉన్నట్టు చెప్పారు. వారి ప్రయత్నాలు వాణిజ్య వెంచర్లుగా రూపాంతరం చెందడం లేదన్న ఆవేదనను ఆమె వ్యక్తం చేశారు. వినూత్నంగా ఉంటున్నప్పటికీ కార్పొరేట్‌ బోర్డుల్లో ఎంత మంది మహిళలకు చోటు లభించిందో పరిశీలించాలని సూచించారు. మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వాల్సిన అవసరం లేదన్న మంత్రి స్మృతి ఇరానీ ఇటీవలి వ్యాఖ్యలపై విమర్శలు రావడం తెలిసిందే. అయితే తన వ్యాఖ్యలను ఆమె సమర్థించుకున్నారు. ‘‘మీ కంపెనీ హెచ్‌ఆర్‌ హెడ్‌ ప్రతి నెలా మీ నెలసరిని అడిగి తెలుసుకునే పరిస్థితిని ఊహించగలరా?’’అని ఆమె ప్రశ్నించారు.

నెలసరి సెలవు ఇవ్వడం ప్రస్తుత చట్టాలకు సైతం విరుద్ధమన్నారు. ‘‘మహిళలు పెళ్లి చేసుకుంటే, పిల్లల కారణంగా పురోగతి చూపించలేరని గతంలో వారికి అవకాశాలు తిరస్కరించడాన్ని చూశాం. ఇప్పుడు నెలసరి రూపంలో వారికి ఉపాధిని నిరాకరించే పరిస్థితిని సృష్టించడం అవసరం అంటారా?’’అని ఇరానీ తన అభిప్రాయాలను పంచుకున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే విషయంలో ఒకే విధానం సరికాదన్నారు. సంప్రదింపుల నైపుణ్యాలను విద్యార్థుల్లో, ముఖ్యంగా మహిళా విద్యార్థుల్లో కలి్పంచడంపై దృష్టి సారించాలని బిజినెస్‌ స్కూళ్లకు ఆమె సూచించారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)