Breaking News

స్మార్ట్‌ రింగ్లో.. మన ఆరోగ్యం

Published on Sat, 06/21/2025 - 08:24

ఆరోగ్యాన్ని, ఫిట్‌నెస్‌నూ స్మార్ట్‌గా తెలుసుకోవడానికి వాడే స్మార్ట్‌ బ్యాండ్, స్మార్ట్‌ వాచ్‌లకు పోటీగా ఇప్పుడు స్మార్ట్‌ రింగ్స్‌ వచ్చాయి. చిన్నదే గానీ వేరబుల్స్‌ రంగంలో ఇవి కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి. వినియోగంలో ఎక్కువ సౌలభ్యం.. 24 x 7 ధరించే వెసులుబాటు.. అధిక బ్యాటరీ సామర్థ్యం.. తేలిగ్గా, స్టైలిష్‌ లుక్‌తో ట్రెండీగా, ఉండటం వంటివి ఈ రింగ్స్‌కి కలిసి వచ్చే అంశాలు. నిద్ర తీరును తెలుసుకోవాలంటే స్మార్ట్‌ వాచ్‌ కంటే ఈ రింగే అత్యుత్తమం. ఇలాంటి ఎన్నో అనుకూలాంశాలు ఉన్నాయి కాబట్టే.. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ఈ స్మార్ట్‌ ఉంగరాన్ని ఎంచక్కా తొడిగేస్తున్నారు.

స్మార్ట్‌ రింగ్‌లో రకరకాల సెన్సార్స్‌ ఉంటాయి. చర్మం కిందనున్న రక్తంలోకి ప్రసరిస్తూ హృదయ స్పందనల వేగాన్ని తెలుసుకునే ఫొటోప్లిథైస్మోగ్రఫీ (పీపీజీ) సెన్సార్స్, ఉష్ణోగ్రతను కొలిచే టెంపరేచర్‌ చెకర్, నడక, పరుగు, సైక్లింగ్, నిద్రలో కదలికలు, నిద్రాభంగాన్ని కొలిచే మినీ మోషన్‌  సెన్సార్‌ (యాక్సిలరేటర్‌), రక్తంలో ఆక్సిజన్‌ మోతాదులను కొలిచే ఎస్‌పీఓ–2 సెన్సార్‌ ఉంటాయి. సేకరించిన సమాచారం ఇందులోని బ్లూటూత్‌ సాయంతో యూజర్‌ స్మార్ట్‌ఫోన్‌ లోని యాప్‌లో నిక్షిప్తం అవుతుంది. యాప్‌ను తెరిచి ఈ సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

నిద్ర సమస్యలు
స్మార్ట్‌ రింగ్‌ ధరించిన వారు ఉదయం ఎప్పుడు నిద్రలేస్తున్నారు, రాత్రి నిద్రను  ఆపుకొంటూ ఉంటున్నారా, వారి నిద్రలో నాణ్యత ఉందా అన్న అంశాలతో పాటు నిద్రకు సంబంధించిన సమస్యలేమైనా ఉన్నాయా అని తెలుపుతుంది. అలాగే స్లీప్‌ ఆప్నియా సమస్యను తెలుసుకుని, మెదడుకు ఆక్సిజన్‌  అందనప్పుడు ఆ విషయాన్ని తెలియజేయడం, ముప్పు గురించి హెచ్చరిక పంపడం.. తద్వారా ప్రాణాలను రక్షించడమూ చేస్తుంది.

 గుండె ఆరోగ్య సమాచారం
గుండె స్పందనల వేగాన్నీ, వైవిధ్యాన్ని బట్టి ఓ వ్యక్తి తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాడా, ఆ ఒత్తిడి ప్రభావం అతడి గుండె మీద ప్రతికూలంగా పడుతోందా అన్న అంశాలను తెలుసుకుంటుంది.

జ్వరం, ఇన్ఫెక్షన్ల వివరాలు
దేహ ఉష్ణోగ్రతలూ, శ్వాస వేగం వీటన్నింటి ఆధారంగా ఓ వ్యక్తికి జ్వరం ఉందా అన్న అంశాన్ని గుర్తించవచ్చు. ఉదాహరణకు ఇటీవల కోవిడ్‌–19 స్వైరవిహారం చేసినప్పుడు ఈ తరహా రింగ్స్‌ చాలామందిని హెచ్చరిస్తూ అప్రమత్తం చేశాయి.

మహిళల ఆరోగ్యం
మహిళల శరీర ఉష్ణోగ్రత, ఇతరత్రా సమాచారంతో పాటు.. అండం ఎప్పుడు విడుదలైంది, భాగస్వామితో ఎప్పుడు కలిస్తే గర్భధారణ తేలిగ్గా జరుగుతుంది,  గర్భధారణ వద్దనుకుంటే ఏ సమయంలో కలవకూడదు లాంటి సమాచారం రెడీగా దొరుకుతుంది. 

రిమోట్‌ డాక్టర్‌ మానిటరింగ్‌ 
గుండె జబ్బులూ లేదా ఉపిరితిత్తుల సమస్యలున్న వృద్ధులకు ‘సర్కల్‌ +’ లాంటి స్మార్ట్‌ రింగ్స్‌ ఎప్పటికప్పుడు డాక్టర్లకు సమాచారాన్ని తెలియజేస్తుంటాయి. తద్వారా అవసరమైన ఆరోగ్య సలహాలూ, సూచనలూ లేదా ప్రిస్క్రిప్షన్స్‌ లో వైద్యులు మార్పులు, చేర్పులు చేస్తారు.

వేటికవే ప్రత్యేకం
ఔరా రింగ్‌ (యూఎస్‌ఏ): ఇది పూర్తి ఆరోగ్య సమాచారంతో పాటు నిద్రకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తూ సైంటిస్టులకు బాగా ఉపయోగపడుతున్నాయి.

అల్ట్రా హ్యూమన్‌  రింగ్‌ ఎయిర్‌: వ్యాయామాలకూ, దేహ జీవక్రియల పనితీరును (మెటబాలిక్‌ రేట్‌ ట్రాకింగ్‌) గమనించేందుకు, అలాగే చక్కెర విలువలను తెలుసుకునేందుకు పనికొస్తుంది.

సర్క్యులర్‌ రింగ్‌: దీన్ని కస్టమైజ్‌ చేసుకోవచ్చు. అంటే మనకు కావాల్సిన సమాచారం తీసుకునేలా అవసరమైన అమరికలు జరుపుకోవచ్చు. ఇవి వైబ్రేషన్‌  ద్వారా హెచ్చరికలు (వైబ్రేషన్‌  అలర్ట్స్‌) కూడా పంపుతూ అప్రమత్తం చేస్తుంటాయి.

ఈవీ రింగ్‌ (యూఎస్‌ఏ): ఇది మహిళలకూ, యువతులకూ ఉపయోగపడేది. రుతుచక్రాల వివరాలను తెలుపుతుంది.

గో 2 స్లీప్‌: ఇది చైనాకు సంబంధించినది. నిద్రలో ఎవరికైనా ఊపిరి ఆగితే వెంటనే అప్రమత్తం చేసి నిద్రలేపుతుంది.

సర్కల్‌ + రింగ్‌ (యూఎస్‌ఏ): ఇది ఆసుపత్రుల్లో రోగులకు ఉపయోగపడేది. వీటి ద్వారానే అనేక మెడికల్‌ రీడింగ్స్‌ తెలుసుకోవచ్చు. వీటిని వృద్ధులకూ వాడతారు.

  • వీటికీ పరిమితులు
    ఇవి పూర్తిగా స్మార్ట్‌ అని చెప్పలేం. వీటికీ కొన్ని పరిమితులు ఉన్నాయి. 
    ఫలితాలు తెలియజేసే స్క్రీన్‌  వీటికి ఉండదు. 
     కొన్ని స్మార్ట్‌ వాచెస్‌ మాదిరిగా ఇవి ఇంకా ఈసీజీ తీసుకోలేవు. 
    జీపీఎస్‌ లేనందువల్ల నడక, పరుగు మార్గాలను చూపలేవు.
    వీటి అలర్ట్‌ బజ్‌ శబ్దం చాలా గట్టిగా వినిపించేలా ఉండదు. 

చివరగా... ఈ రింగ్స్‌ స్మార్ట్‌గా అందంగా అలంకరించుకునే ఓ చిన్ని ఉంగరంలా కనిపిస్తూ.. ఆరోగ్య రక్షణకోసం అవసరమైన అనేక రకాల సమాచారాన్ని సేకరిస్తూ..  వాటిని తొడుక్కున్నవారికీ, భవిష్యత్తులో డాక్టర్లకూ ఆ సమాచారం అందిస్తూ ఉండే ఉపకరణాలు.  

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)