Breaking News

500 మందికి మాత్రమే.. ఈ కారు - ధర ఎంతో తెలుసా?

Published on Mon, 07/03/2023 - 15:08

Skoda Kushaq Matte Edition: చెక్ రిపబ్లిక్ కార్ తయారీ సంస్థ 'స్కోడా' (Skoda) భారతీయ మార్కెట్లో 'కుషాక్' (Kushaq) కారుని విడుదల చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఈ తరుణంలో కంపెనీ ఇందులో ఓ కొత్త ఎడిషన్ విడుదల చేసింది. కుషాక్ కొత్త ఎడిషన్ ధర, ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

ధర & వేరియంట్స్
స్కోడా ఇండియా విడుదల చేసిన కొత్త కారు పేరు 'కుషాక్ మ్యాట్ ఎడిషన్‌' (Kushaq Matte Edition). ధరల విషయానికి వస్తే, 1.0 టీఎస్ఐ మాన్యువల్‌ రూ. 16.19 లక్షలు, 1.0 టీఎస్ఐ ఆటోమేటిక్‌ రూ. 17.79 లక్షలు, 1.5 టీఎస్ఐ మాన్యువల్‌ రూ. 18.19 లక్షలు, టాప్ స్పెక్ 1.5 టీఎస్ఐ ఆటోమేటిక్ ధర రూ. 19.39 లక్షలు. ఈ కొత్త ఎడిషన్ ధర స్టాండర్డ్ కుషాక్ స్టైల్ వేరియంట్ కంటే రూ. 40,000 ఎక్కువ కావడం గమనార్హం.

లిమిటెడ్ ఎడిషన్
స్కోడా కుషాక్ మ్యాట్ ఎడిషన్‌ దాని లైనప్‌లో స్టైల్ అండ్ మోంటే కార్లో వేరియంట్‌ల మధ్య ఉంటుంది. ఇది కేవలం 500 యూనిట్లకు మాత్రమే పరిమితమై ఉంటాయి. అంటే ఈ కొత్త కారుని కేవలం 500 మంది మాత్రమే కొనుగోలు చేయగలరు.

(ఇదీ చదవండి: 750సీసీ విభాగంలో రాయల్ బండి.. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క!)

మ్యాట్ ఎడిషన్ ప్యాకేజీలో భాగంగా, కంపెనీ కార్బన్ స్టీల్ ఎక్స్‌టీరియర్ పెయింట్ షేడ్‌ పొందుతుంది. డోర్ హ్యాండిల్స్‌పై గ్లోస్ బ్లాక్ ట్రిమ్, వింగ్ మిర్రర్స్, గ్రిల్‌పై క్రోమ్ బిట్‌లు చూడవచ్చు. కుషాక్ మోంటే కార్లో ఎడిషన్ విజయం పొందిన తరువాత కంపెనీ తన ఉనికిని మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే మ్యాట్ ఎడిషన్ లాంచ్ చేసింది.

(ఇదీ చదవండి: 750సీసీ విభాగంలో రాయల్ బండి.. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క!)

ప్రత్యర్థులు
కుషాక్ మ్యాట్ ఎడిషన్ దాని విభాగంలో ఫోక్స్‌వ్యాగన్ టైగన్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున అమ్మకాల పరంగా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కావున ఈ ఎడిషన్ ఎలాంటి అమ్మకాలను పొందుతుందనేది త్వరలోనే తెలుస్తుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)