ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్
Breaking News
దసరా పండుగ : సింగర్ ఇంటికి కొత్త లగ్జరీ కారు
Published on Tue, 10/20/2026 - 11:09
ప్రముఖ టాలీవుడ్ నేపథ్య గాయకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత రాహుల్ సిప్లిగంజ్ దసరా సందర్భంగా కొత్త లగ్జరీ కారును సొంతం చేసుకున్నారు. టెస్లా (Tesla) కారు ఇంటికి తెచ్చుకున్నామంటూ రాహుల్ స్వయంగా ఇన్‌స్టాలో వెల్లడించారు. తన భార్య హరిణ్యతో కలిసి ఫోజులిచ్చిన ఫోటోలను షేర్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఈ దంపతులకు శుభాకాంక్షలు అందిస్తున్నారు.

"భగవంతుడి ఆశీస్సులతో ఈ ప్రత్యేక సందర్భంలో కొత్త వాహనం" (A New Vahanam on this special occasion) అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు అభినందలు తెలిపారు. కాగా రాహుల్ గ్యారేజ్‌లో ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్, వోల్వో వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. రాహుల్ సిప్లిగంజ్ తన ప్రేయసి హరిణ్యను గత ఏడాది నవంబర్ 27న పెళ్లాడిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: టీవీకేకు రూ.13.3 కోట్ల విరాళాలు, 99 శాతం ఆ ఇద్దరి నుంచే!
ఇదీ చదవండి: నీటి బుడగ జీవితం గురించి బోధిస్తుండగానే ప్రాణం పోయింది!
Tags : 1