Breaking News

వెండికి హాల్‌మార్కింగ్‌.. వజ్రాభరణాలపై ఫ్రేమ్‌వర్క్‌

Published on Sat, 11/29/2025 - 08:29

బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి చేసిన ప్రభుత్వం.. విలువైన లోహాల స్వచ్ఛతను ధ్రువీకరించేలా దాని పరిధిని విస్తరించాలని చూస్తోంది. అందులో భాగంగా వెండి ఆభరణాలకు కూడా హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాకుండా సహజ, ల్యాబ్ గ్రోన్ డైమండ్ల మధ్య వ్యత్యాసాన్ని వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయడానికి, ఈ విభాగంలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడానికి ఒక ఫ్రేమ్‌వర్క్‌ను కూడా ప్రభుత్వం తీసుకురానుంది.

వెండికి హాల్‌మార్కింగ్

జూన్ 2021 నుంచి బంగారు ఆభరణాలకు తప్పనిసరి అయిన హాల్‌మార్కింగ్‌ వెండి ఆభరణాల కోసం సెప్టెంబర్ 1, 2025 నుంచి స్వచ్ఛందంగా ప్రవేశపెట్టబడింది. అయితే దీన్ని రానున్న రోజుల్లో తప్పనిసరి చేయాలని యోచిస్తోంది. ఇటీవల సీఐఐ నిర్వహించిన రత్నాలు, ఆభరణాల సదస్సులో వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే మాట్లాడుతూ.. బంగారు హాల్‌మార్కింగ్‌కు పరిశ్రమ, వినియోగదారుల నుంచి లభించిన సానుకూల స్పందన ప్రభుత్వాన్ని ప్రోత్సహించిందని తెలిపారు. ‘వెండి హాల్‌మార్కింగ్‌ను స్వచ్ఛందంగా చేయడం ద్వారా దాని ఫలితం, ప్రజల స్పందన ఎలా ఉందో పరిశీలిస్తున్నాం. వెండి ఆభరణాలను సైతం ధరించే మన దేశంలోని వినియోగదారులు తాము కొనుగోలు చేస్తున్న ఉత్పత్తుల విశ్వసనీయతను నిర్ధారించడం చాలా ముఖ్యం’ అని ఖరే అన్నారు. వెండి హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేయడానికి ముందు పరిశ్రమ ప్రతిస్పందనకు తగినంత సమయం ఇస్తున్నామని వివరించారు.

తప్పనిసరి హాల్‌మార్కింగ్‌(బంగారానికి) ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం 57.17 కోట్ల బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్‌ చేసినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే సుమారు 8.44 కోట్ల వస్తువులకు హాల్‌మార్క్‌ వేసినట్లు పేర్కొన్నారు.

బీఐఎస్ పరిధిలో..

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ఆధ్వర్యంలో ఈ హాల్‌మార్కింగ్‌ ప్రక్రియ జరుగుతోంది. ప్రస్తుతం 2 లక్షల మందికి పైగా ఆభరణాల వ్యాపారులు, 65 లైసెన్స్ పొందిన రిఫైనర్లు బీఐఎస్‌లో నమోదు చేసుకున్నారు. అస్సేయింగ్ హాల్‌మార్కింగ్‌ సెంటర్ల (AHL) విస్తరణను కూడా ప్రభుత్వ పరిశీలిస్తుంది. దేశవ్యాప్తంగా 1,603 బీఐఎస్ గుర్తింపు పొందిన ఏహెచ్‌ఎల్‌లు, 109 ఆఫ్ సైట్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. అయితే ఈ కేంద్రాల్లో దేన్నీ ప్రభుత్వం నిర్వహించకపోవడం గమనార్హం.

ల్యాబ్ గ్రోన్ డైమండ్లపై పారదర్శకత

సాంకేతికత అభివృద్ధి చెందడంతో ల్యాబ్ గ్రోన్ డైమండ్లు వాణిజ్యపరంగా లాభదాయకంగా మారాయి. అయితే, సహజ వజ్రాల కంటే అవి చౌకగా ఉన్నందున వినియోగదారులు మోసపోకుండా ఉండటానికి పారదర్శకతను నిర్ధారించేలా ఫ్రేమ్‌వర్క్‌ అవసరమని ఖరే నొక్కి చెప్పారు. పరిశ్రమపై భారం పడకుండా పారదర్శకత తీసుకురావడానికి ప్రభుత్వం జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్ కౌన్సిల్(GJEPC), ఇతర సంస్థలతో కలిసి పనిచేస్తోందని తెలిపారు.

ఇదీ చదవండి: ఐటీఆర్‌ ఫైలింగ్‌లో తప్పులు.. నోటీసులు వస్తే ఏం చేయాలి?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)