Breaking News

రూ.64 కోట్లతో లగ్జరీ డూప్లెక్స్‌ అపార్ట్‌మెంట్‌ కొనుగోలు

Published on Thu, 07/24/2025 - 14:06

మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్ ఛైర్మన్ రంజన్ పాయ్ భార్య శ్రుతి పాయ్ బెంగళూరులోని జయమహల్ ఎక్స్‌టెన్షన్‌లో లగ్జరీ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను రూ.64 కోట్లకు కొనుగోలు చేశారు. ఈమేరకు జాప్కీకి అందిన డాక్యుమెంట్లు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఈ రియల్టీ డీల్‌ ఆ ప్రాంతంలో అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ లావాదేవీల్లో ఒకటిగా నిలిచింది. బెంగళూరు అల్ట్రా లగ్జరీ హౌసింగ్ మార్కెట్‌లో పెరుగుతున్న మార్పును ఇది హైలైట్‌ చేస్తుంది.

ఒకప్పుడు స్టాండలోన్ బంగ్లాలు ఆధిపత్యం చెలాయించిన రూ.50 కోట్లకు పైగా ఉన్న ఈ విభాగంలో ఇప్పుడు ప్రీమియం అపార్ట్‌మెంట్లకు డిమాండ్ పెరుగుతోందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. సెంట్రల్ బెంగళూరులో అత్యంత డిమాండ్ ఉన్న రెసిడెన్షియల్ ఎన్‌క్లేవ్‌ల్లో ఒకటైన సవ్యసాచి సరయూలో శ్రుతి పాయ్ ఈ ప్రాపర్టీని కొనుగోలు చేశారు. 12,800 చదరపు అడుగుల బిల్టప్ ఏరియా, 9,929 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో బాల్కనీలు, లిఫ్ట్ లాబీతో ఈ అపార్ట్‌మెంట్‌ విస్తరించి ఉంది. కార్పెట్ ఏరియాలో చదరపు అడుగుకు రూ.64,457, సూపర్ బిల్టప్‌ ఏరియాలో రూ.50,000 చొప్పున కొనుగోలు చేశారు.

ఇదీ చదవండి: ఉద్యోగం ఇచ్చారు.. అంతలోనే తొలగించారు!

2024లో బెంగళూరుకు చెందిన క్వెస్ కార్ప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ ఐజాక్ బెంగళూరులోని బిలియనీర్ స్ట్రీట్ కోరమంగళ ప్రాంతంలో రూ.67.5 కోట్ల విలువైన 10,000 చదరపు అడుగుల ఆస్తిని కొనుగోలు చేశారు. మే నెలలో యూకేకు చెందిన మార్కెట్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ సీఈఓ పరేష్ రాజా ఎంఐఏ ఎస్టేట్స్‌కు చెందిన 27 సమ్మిట్ ప్రాజెక్టులో లగ్జరీ పెంట్ హౌజ్‌ను రూ.54.38 కోట్లకు కొనుగోలు చేశారు. గత డిసెంబర్‌లో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి బెంగళూరులోని కింగ్ ఫిషర్ టవర్స్‌లో రెండో లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను రూ.50 కోట్లకు కొనుగోలు చేశారు.
 

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు