Breaking News

రూ. 500 నోట్ల రద్దు.. నిజమేనా?

Published on Fri, 06/09/2023 - 09:00

భారతదేశంలో ప్రస్తుతం నోట్ల రద్దు, ఉపసంహరణ మాటలు జోరుగా వినిపిస్తున్నాయి. రూ. 2000 నోట్ల ఉపసంహరణ ఇప్పటికే ప్రారంభమైంది. కాగా రూ. 500 నోట్లను కూడా రిజర్వ్ బాంక్ అఫ్ ఇండియా రద్దు చేస్తుందని లేదా ఉపసంహరించుకుంటుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపైన ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

శక్తికాంత దాస్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఇప్పుడు రూ. 500 నోట్ల రద్దు & ఉపసంహరణకు సంబంధించిన వార్తలన్నీ అవాస్తవాలే అని, ఇప్పటి వరకు ఈ విషయంపై ఆర్‌బీఐ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, అలాంటి ఆలోచన కూడా లేదని తెలిసింది. అంతే కాకుండా రూ. 1000 నోట్లను మళ్ళీ ప్రవేశపెట్టే ఉద్దేశ్యం అసలే లేదని వెల్లడించారు.

(ఇదీ చదవండి: రెపో రేటుపై ఆర్‌బీఐ ప్రకటన.. కీలక వడ్డీ రేట్లు యధాతథం)

రూ. 500 నోట్ల రద్దు మీద జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని శక్తికాంత దాస్ వెల్లడించారు. రూ.2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్‌ వివరణ ఇచ్చారు. ఇప్పటికి చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 50 శాతం వెనక్కి వచ్చాయని దాస్ తెలిపారు. తిరిగి వచ్చిన నోట్ల విలువ సుమారు రూ.1.82 లక్షల కోట్లు. చెలామణిలో ఉన్న రెండు వేల నోట్ల విలువ రూ. 3.62 లక్షల కోట్లు అని గతంలోనే వెల్లడించారు.

(ఇదీ చదవండి: వేల కోట్లు వద్దనుకుని చిన్న అపార్ట్‌మెంట్‌లో రతన్ టాటా తమ్ముడు - ఎందుకిలా..)

తిరిగి వచ్చిన రూ. 2,000 నోట్లలో 85 శాతం నోట్లు బ్యాంకు డిపాజిట్లుగా, మిగిలినవి మార్పిడి కోసం వచ్చినట్లు ఆర్‌బీఐ గవర్నర్ తెలిపారు. 2023 మే 19న ఆర్‌బీఐ రెండు వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నోట్ల మార్పిడికి లేదా డిపాజిట్ చేసుకోవడానికి సెప్టెంబర్ 30 చివరి రోజు అని కూడా అప్పుడే తెలిపింది.

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)