Breaking News

సాక్షి మనీ మంత్రా: రికార్డు స్థాయినుంచి వెనక్కి, ఐటీ జోరు

Published on Thu, 07/13/2023 - 15:48

దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి.  ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలు, ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుందనే దేశీయ  ద్రవ్యోల్బణం ఆందోళన కుదుట పడిన నేపథ్యంలో  ఆరంభంలో భారీగా  ఎగిసింది.  ఫలితంగా ఆల్‌ టైం గరిష్టానికి చేరిన సూచీలు డే హై నుంచి వెనక్కి తగ్గాయి.  లాభాల  స్వీకరణతో  సెన్సెక్స్ 165 పాయింట్ల లాభానికి పరిమితమై 65,559 వద్ద, నిఫ్టీ  30 పాయింట్లు లాభంతో పెరిగి 19,414 వద్ద ముగిసింది. ప్రధానంగా  ఐటీ, రియల్టీ షేర్లు   మార్కెట్‌ లాభాలను నిలబెట్టాయి.  ఫలితంగా నిఫ్టీ 19400  ఎగువన, సెన్సెక్స్‌ 65500 కి ఎగువన  స్థిరపడడటం విశేషం.

నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, టిసిఎస్, ఇన్ఫోసిస్, ఎల్‌టిఐఎండ్‌ట్రీ,  టెక్ మహీంద్రా టాప్ గెయినర్స్‌గా ఉండగా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోల్ ఇండియా, బిపిసిఎల్, యుపిఎల్, మారుతీ సుజుకీ నష్టపోయాయి. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 0.5 శాతం చొప్పున క్షీణించాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎంసిజి, హెల్త్‌కేర్, ఆయిల్ & గ్యాస్, పవర్ రంగాలలో అమ్మకాలు కనిపించగా, బ్యాంక్, మెటల్, రియాల్టీ ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పేర్లలో  బైయింగ్‌ కనిపించింది. 

విశేషాలు
-  సెన్సెక్స్ తొలిసారిగా చారిత్రాత్మక 66,000 మార్క్‌ను అధిగమించింది.
-  సెన్సెక్స్‌   డే హై  నుంచి 600 పాయింట్లు పతనమైంది
- 19567 పాయింట్ల వద్ద నిఫ్టీ ఆల్‌ టైం హై
- నిఫ్టీ 160 పాయింట్లు క్షీణించి,  ఒక దశలో 19,400 దిగువకు జారిపోయింది. చివరికి ఈ స్థాయిని నిలబెట్టుకుంది.
-  నిఫ్టీ  బ్యాంక్ రోజు గరిష్టం నుండి 400 పాయింట్లకు పైగా క్షీణించింది.

రూపాయి
రూపాయి మార్కెట్ల  మద్దతుతో ఆరంభంలో 21పైసలు ఎగిసింది. చివరికి గత ముగింపు 82.24తో పోలిస్తే డాలర్‌ మారకంలో రూపాయి 17 పైసలు పెరిగి 82.07 వద్ద ముగిసింది. 

Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)