Breaking News

మెప్పించని ఆర్‌బీఐ పాలసీ

Published on Fri, 02/09/2024 - 04:14

ముంబై: ఆర్‌బీఐ నుంచి కీలక వడ్డీ రేట్ల తగ్గింపుపై స్పష్టత కొరవడంతో రేట్ల ఆధారిత రంగాలైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సరీ్వసెస్, ఆటో, రియలీ్ట, కమోడిటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బలహీన డిసెంబర్‌ క్వార్టర్‌ ఫలితాల నమోదుతో ఎఫ్‌ఎంసీజీ షేర్లూ డీలా పడ్డాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్‌ 724 పాయింట్లు నష్టపోయి 71,428 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 213 పాయింట్లు పతనమై 21,718 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూల సంకేతాలతో ఉదయం సూచీలు లాభాలతో మొదలయ్యాయి. ఆర్‌బీఐ పాలసీ ప్రకటన వెల్లడి ఐటీ, ఇంధన షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 921 పాయింట్లు పతనమై 71,231 వద్ద, నిఫ్టీ 266 పాయింట్లు క్షీణించి 21,665 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి.

వడ్డీ రేట్ల ప్రభావిత షేర్లు డీలా
ఆర్‌బీఐ నుంచి వడ్డీ రేట్ల తగ్గింపుపై స్పష్టత రాకపోవడంతో బ్యాంకింగ్, ఆటో, రియల్టీ షేర్లు నష్టాలు చివచూశాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లు ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ 4%, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 3.50%, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 3%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఫెడరల్‌ బ్యాంక్‌ 2% చొప్పున నష్టపోయాయి. ఆటో రంగ షేర్లూ నష్టాల బాటపట్టాయి.

ఐషర్‌ మోటార్స్‌ 3%, అపోలో టైర్స్‌ 2.50%, మారుతీ, ఎంఅండ్‌ఎం, సంవర్ధన మదర్సన్‌ షేర్లు 2%, టీవీఎస్, అశోక్‌ లేలాండ్, టాటా మోటార్స్‌ షేర్లు 1%, ఎంఆర్‌ఎఫ్‌ 0.10% చొప్పున నష్టపోయాయి. బీఎస్‌ఈ ఆటో ఇండెక్స్‌ 1% పతనమైంది. అలాగే రియల్టీ రంగ షేర్లైన గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ 3.50%, శోభ, లోథా 3%, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ 1% మేర నష్టపోయాయి.  నిబంధనల అతిక్రమణ కారణంగానే పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై చర్యలు తీసుకున్నట్లు ఆర్‌బీఐ అధికారులు తెలపడంతో పేటీఎం షేరు 10% పతనమై రూ.447 వద్ద లోయర్‌ సర్క్యూట్‌ తాకింది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)