Breaking News

–1,207 నుంచి +843 పాయింట్లకు సెన్సెక్స్‌

Published on Sat, 12/14/2024 - 04:28

ముంబై: ప్రారంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్న స్టాక్‌ సూచీలు శుక్రవారం భారీ లాభాలు నమోదుచేశాయి. టెలికం, ఐటీ, కన్జూమర్, ఎఫ్‌ఎంసీజీ షేర్లు ఇందుకు అండగా నిలిచాయి. దేశీయంగా ద్రవ్యోల్బణ దిగిరావడమూ కలిసొచ్చింది. ఇంట్రాడేలో 1,207 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌ అనూహ్యంగా రికవరీ అయ్యి చివరికి 843 పాయింట్ల లాభంతో 82,133 వద్ద నిలిచింది. నిఫ్టీ 220 పాయింట్లు పెరిగి 24,768 వద్ద స్థిరపడింది.

 మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో సూచీలు ఉదయం బలహీనంగా మొదలయ్యాయి. వీక్లీ ఎక్స్‌పైరీ ప్రభావంతో ప్రారంభంలో సెన్సెక్స్‌ 1,207 పాయింట్లు క్షీణించి 80,083 వద్ద, నిఫ్టీ 368 పాయింట్లు పతనమై 24,181 వద్ద కనిష్టాలకు దిగివచ్చాయి. అయితే ద్రవ్యోల్బణం తగ్గిన నేపథ్యంలో వడ్డీరేట్ల సంబంధిత షేర్లు ఫైనాన్స్, రియలీ్ట, ఆటో షేర్లు రాణించడంతో సూచీలు నష్టాల నుంచి గట్టెక్కాయి. 

మిడ్‌ సెషన్‌ నుంచి కొనుగోళ్ల తీవ్రత మరింత పెరగడంతో లాభాలు ఆర్జించగలిగాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 924 పాయింట్లు పెరిగి 82,213 వద్ద, నిఫ్టీ 243 పాయింట్లు బలపడి 24,792 వద్ద గరిష్టాలు అందుకున్నాయి. మెటల్, సర్వీసెస్, కమోడిటీస్, ఇండ్రస్టియల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్‌ఈ స్మాల్, మిడ్‌ క్యాప్‌ సూచీలు 0.29%, 0.08 శాతం చొప్పున నష్టపోయాయి. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)