Breaking News

లాభాలు ఒకరోజుకే పరిమితం

Published on Fri, 07/28/2023 - 04:13

ముంబై: దేశీయ స్టాక్‌ సూచీల లాభాలు ఒకరోజుకే పరిమితమయ్యాయి. జూలై ఎఫ్‌అండ్‌ఓ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడంతో బ్యాంకింగ్, ఇంధన, ఆటో షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు., అధిక వెయిటేజీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎంఅండ్‌ఎం, నెస్లే, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్ల పతనం సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచాయి. ఉదయం సెన్సెక్స్‌ 127 పాయింట్ల లాభంతో 66,629 వద్ద, నిఫ్టీ 73 పాయింట్లు పెరిగి 19,851 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించాయి.

దేశీయంగా నెలకొన్న ప్రతికూల సంకేతాలతో సూచీలు రోజంతా బలహీనంగా కదలాడాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 646 పాయింట్లు క్షీణించి 66,326 వద్ద, నిఫ్టీ 174 పాయింట్లు పతనమై 19,604 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. ఆఖర్లో కొంత కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీల నష్టాల కొంత భర్తీ అయ్యాయి.

చివరికి సెన్సెక్స్‌ 440 పాయింట్లు నష్టపోయి 66,267 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 118 పాయింట్లు కోల్పోయి 19,660 వద్ద నిలిచింది. నష్టాల మార్కెట్లో ఫార్మా, రియలీ్ట, టెలికాం, క్యాపిటల్‌ గూడ్స్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,979 కోట్ల షేర్లు విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,528 కోట్ల షేర్లను కొన్నారు. ఈసీబీ, బ్యాంక్‌  ఆఫ్‌ జపాన్‌ వడ్డీరేట్ల వెల్లడికి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.

మార్కెట్లో మరిన్ని సంగతులు
► దేశీయంగా సర్వర్లు తయారు చేసే నెట్‌వెబ్‌ టెక్నాలజీస్‌ ఇండియా బంపర్‌ లిస్టింగ్‌ సాధించింది. బీఎస్‌ఈ ఇష్యూ ధర (రూ.500)తో పోలిస్తే 82.40% భారీ ప్రీమియంతో రూ.942.50 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 91% ర్యాలీ చేసి రూ. 942.50 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 82.10% లాభంతో రూ.910.50 వద్ద స్థిరపడింది.
► జూన్‌ క్వార్టర్‌లో నికర లాభం 21% వృద్ధి సాధించడంతో ఆర్‌ఈసీ లిమిటెడ్‌ షేరు 7% పెరిగి రూ. 186 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో తొమ్మిదిశాతం ర్యాలీ చేసి రూ.189 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది.
► తొలి త్రైమాసిక ఫలితాలు మెప్పించలేకపోవడంతో టెక్‌ మహీంద్రా షేరు నాలుగుశాతం నష్టపోయి రూ.1,100 వద్ద ముగిసింది.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌