Breaking News

ఇన్ఫోసిస్‌కి సెబీ వార్నింగ్‌! ఏం జరిగింది?

Published on Thu, 08/10/2023 - 21:59

SEBI warning letter to Infosys: దేశీయ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌కి మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా) పాలనాపరమైన హెచ్చరిక జారీ చేసింది. కంపెనీ స్ట్రక్చర్డ్ డిజిటల్ డేటాబేస్ (ఎస్‌డీడీ)లో జాప్యం జరుగుతుండటంపై హెచ్చరించింది.

‘ఎస్‌డీడీలో కొన్ని ఎంట్రీలు ఆలస్యంగా నమోదయ్యాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్ మహమ్మారి కారణంగా చాలా మంది ఉ‍ద్యోగులు క్యాంపస్‌ల నుంచి కాకుండా వారి ఇళ్ల వద్ద నుంచే పని చేస్తున్న సమయంలో ఇన్పోసిస్‌ దీన్ని సమర్పించింది. అందువల్ల, ఈ రికార్డులను సమన్వయం చేయడం, నిర్వహించడం కష్టమైంది. అప్పుడు యూపీఎస్‌ఐకి సంబంధించిన సమాచారం కంపెనీ వద్ద అందుబాటులో ఉన్నప్పటికీ, ఎస్‌డీడీ సిస్టమ్‌లో నవీకరించడం ఆలస్యం అయింది’ అని ఆగస్ట్ 9న రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఇన్ఫోసిస్ పేర్కొంది. అయితే, ఈ వాదనను అంగీకరించడం లేదని సెబీ తెలిపింది.

సెబీ వార్నింగ్‌ లెటర్‌
ఎస్‌డీడీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఇన్ఫోసిస్‌కు పంపిన లేఖలో హెచ్చరించింది. ఎస్‌డీడీలో సమాచారం సరిగ్గా ఉండేలా ఎప్పటిక‍ప్పుడు సమీక్షించాల్సి ఉందంది. ఇందులో ఉల్లంఘనలను  తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. ఇకపై ఎస్‌డీడీ నిర్వహణకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ఎస్‌డీడీ అంటే ఏమిటి?
స్ట్రక్చర్డ్ డిజిటల్ డేటాబేస్ లేదా ఎస్‌డీడీ అనేది వ్యక్తులు లేదా సంస్థ పేర్లకు సంబంధించిన సమాచారం.  ఈ సమాచారాన్ని ప్రచురించడానికి వీలులేని విలువైన సున్నితమైన సమాచారం (యూపీఎస్‌ఐ)గా పేర్కొంటారు. దీన్ని సెబీ అంతర్గత ట్రేడింగ్ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా నిర్వహించాలి. ఈ భావన సెబీ (ప్రోహిబిషన్ ఆఫ్ ఇన్‌సైడర్ ట్రేడింగ్) రెగ్యులేషన్స్, 2015 నుంచి ఉద్భవించింది. 2019 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది.

ఇదీ చదవండి: ఐటీ జాబ్‌ ఇంటర్వ్యూ మరి.. కుప్పలు కుప్పలుగా వచ్చారు! వీడియో వైరల్‌

కాగా సెబీ లేఖ వల్ల ఎలాంటి ఆర్థిక ప్రభావం లేదని ఇన్ఫోసిస్ చెప్పింది. సుపరిపాలనలో భాగంగా అసంపూర్తిగా ఉన్న ఎస్‌డీడీ రికార్డులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టినట్లు తెలిపింది. సెబీ అడ్మినిస్ట్రేటివ్ వార్నింగ్‌ లెటర్‌ వల్ల కంపెనీ ఆర్థిక, ఇతర కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం ఉండదని ఇన్ఫోసిస్‌ పేర్కొంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)