సోషల్‌ మీడియాలో మోసపూరిత కంటెంట్‌ తొలగింపు

Published on Tue, 10/07/2025 - 08:43

సోషల్‌ మీడియా వేదికలపై ఇన్వెస్టర్లను మోసగించే చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను గత 18 నెలల్లో లక్షకు పైగా తొలగించినట్టు సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే తెలిపారు. మోసగాళ్ల బారి నుంచి ఇన్వెస్టర్లకు రక్షణ కల్పించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. చట్టవిరుద్ధమైన కంటెంట్‌ విషయాన్ని గూగుల్, మెటా తదితర ప్లాట్‌ఫామ్‌ల దృష్టికి తీసుకెళ్లి వాటిని తొలగించే దిశగా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.

ఎన్‌ఎస్‌ఈలో ఏర్పాటు చేసిన ఇన్వెస్టర్ల అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మోసపూరిత కంటెంట్‌ను గుర్తించడంతో టెక్నాలజీ సాయపడుతున్నట్టు తెలిపారు. క్యాపిటల్‌ మార్కెట్లపై కేవలం 36 శాతం మందికే అధికంగా లేక మోస్తరు అవగాహన ఉందన్న ఇటీవలి సర్వే ఫలితాలను ప్రస్తావిస్తూ.. ఈ పరిస్థితుల్లో మోసపూరిత కంటెంట్‌ మెజారిటీ ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించే అవకాశం లేకపోలేదన్నారు.

‘విశ్వాసం దెబ్బతింటే అప్పుడు ఆర్థిక వ్యవస్థకు చోదకం కుంటుపడుతుంది. పెట్టుబడులకు ఇన్వెస్టర్లు వెనకాడతారు’అని పాండే పేర్కొన్నారు. అందుకే ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించడం సెబీకి కీలక ప్రాధాన్యంగా తెలిపారు. ఈ దిశగా ఎన్నో చర్యలు చేపట్టినట్టు చెప్పారు.

ఇదీ చదవండి: దేశం విడిచిన కుబేరులు.. కారణాలు..

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)