బోనస్‌ షేర్ల ట్రేడింగ్‌లో సెబీ మార్పులు

Published on Mon, 09/16/2024 - 22:04

బోనస్ షేర్ల క్రెడిట్, ట్రేడింగ్ ప్రక్రియను వేగవంతం చేసే ప్రయత్నంలో భాగంగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. మదుపరులు రికార్డు తేదీ నుండి కేవలం రెండు రోజుల తర్వాత నుంచే బోనస్ షేర్లను ట్రేడ్ చేయగలుగుతారు. అక్టోబర్ 1 నుంచి ఈ సర్దుబాటు అమల్లోకి వస్తుంది.

ప్రస్తుత ఐసీడీఆర్‌ (ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ అండ్ డిస్‌క్లోజర్ రిక్వైర్‌మెంట్స్) నియమాలు బోనస్ ఇష్యూ అమలుకు సంబంధించి మొత్తం టైమ్‌లైన్‌లను సూచిస్తాయి. అయితే ఇష్యూ రికార్డ్ తేదీ నుండి బోనస్ షేర్ల క్రెడిట్, అటువంటి షేర్ల ట్రేడింగ్ కోసం నిర్దిష్ట కాలక్రమం లేదు.

ప్రస్తుతం బోనస్ ఇష్యూ తర్వాత ఇప్పటికే ఉన్న షేర్‌లు అదే ఐఎస్‌ఐఎన్‌ కింద ట్రేడింగ్‌ను కొనసాగిస్తాయి. వీటికి కొత్తగా క్రెడిట్ అయ్యే  బోనస్ షేర్‌లు రికార్డ్ తేదీ తర్వాత 2-7 పని దినాలలో ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంటాయి.

నూతన మార్గదర్శకాల ప్రకారం, బోనస్ షేర్లలో ట్రేడింగ్ ఇప్పుడు రికార్డ్ తేదీ తర్వాత రెండవ పని రోజు (T+2) ప్రారంభవుతుంది. దీంతో మార్కెట్ సామర్థ్యం పెరగడంతోపాటు ఆలస్యం తగ్గుతుంది. అక్టోబర్ 1న లేదా ఆ తర్వాత ప్రకటించిన అన్ని బోనస్ ఇష్యూలకు ఇది వర్తిస్తుంది అని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) ఒక సర్క్యులర్‌లో తెలిపింది.

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)