Breaking News

సెబీ కొత్త ప్రతిపాదన.. రీట్, ఇన్విట్‌లలో మరిన్ని పెట్టుబడులు!

Published on Sun, 04/20/2025 - 08:02

న్యూఢిల్లీ: రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (రీట్‌), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఇన్విట్‌)లలో మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల పరిమితిని పెంచే ప్రతిపాదనను సెబీ ముందుకు తీసుకొచ్చింది. ఈ నిర్ణయం అమలైతే అప్పుడు రీట్, ఇన్విట్‌లలో మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది.

తద్వారా వీటిల్లో లిక్విడిటీ మరింత మెరుగుపడనుంది. ప్రస్తుతం ఒక ఫండ్‌ ఎన్‌ఏవీలో గరిష్టంగా 10 శాతం మేరే రీట్, ఇన్విట్‌లలో పెట్టుబడులకు అనుమతి ఉంది. ఇప్పుడు దీన్ని ఈక్విటీ, హైబ్రిడ్‌ ఫండ్స్‌కు 20 శాతానికి ప్రతిపాదించింది. మే 11 వరకు ఈ ప్రతిపాదనలపై అభిప్రాయాలను తెలియజేయాలని సెబీ కోరింది.    

ఓఎన్‌డీసీ నెట్‌వర్క్‌లోకి యాక్సిస్‌ మ్యుచువల్‌ ఫండ్‌
ఫండ్స్‌లో పెట్టుబడులను సులభతరం చేసే దిశగా ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ (ఓఎన్‌డీసీ)లో చేరినట్లు యాక్సిస్‌ మ్యుచువల్‌ ఫండ్‌ వెల్లడించింది. దీనితో అంతగా ఆర్థిక సేవలు అందుబాటులో లేని, మారుమూల ప్రాంతాల్లోని వారు కూడా సరళతరంగా, తక్కువ వ్యయాలతో తమ ఫండ్‌ స్కీముల్లో ఇన్వెస్ట్‌ చేయడానికి వీలవుతుందని సంస్థ ఎండీ బి. గోప్‌కుమార్‌ తెలిపారు. తమ ప్లాట్‌ఫాంలో యాక్సిస్‌ ఎంఎఫ్‌ చేరడమనేది అందరికీ ఆర్థిక సాధనాలను అందుబాటులోకి తేవాలన్న లక్ష్య సాకారానికి తోడ్పడుతుందని ఓఎన్‌డీసీ ఎండీ టి. కోషి చెప్పారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)