Breaking News

అన్ని వివరాలూ ఇవ్వాల్సిందే: సెబీ

Published on Tue, 02/18/2025 - 21:52

పెట్టుబడి సలహాదారులు (ఐఏలు), పరిశోధన విశ్లేషకులు (ఆర్‌ఏలు) తమ సేవలకు సంబంధించి అన్ని నియమాలు, షరతులను ముందుగానే క్లయింట్లకు వెల్లడించాలని సెబీ ఆదేశించింది. సెబీతో సంప్రదింపుల అనంతరం పరిశ్రమకు చెందిన రీసెర్చ్‌ అనలిస్ట్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ సూపర్‌వైజరీ బాడీ (ఆర్‌ఏఏఎస్‌బీ) లేదా ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ సూపర్‌వైజరీ బాడీ (ఐఏఏఎస్‌బీ) ‘అత్యంత ముఖ్యమైన నిబంధనలు, షరతులను (ఎంఐటీసీ) ఖరారు చేయాల్సి ఉంటుందని సెబీ తన సర్క్యులర్‌లో పేర్కొంది.

ఆర్‌ఏలు జూన్‌ 30 నాటికి ఎంఐటీసీని ప్రస్తుత క్లయింట్లకు ఈ మెయిల్‌ లేదా మరో విధానంలో వెల్లడించాలని ఆదేశించింది. కొత్త క్లయింట్లతో ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. బ్యాంక్‌ బదిలీ లేదా యూపీఐ ద్వారా స్వీకరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ‘‘స్థిర విధానంలో ప్రస్తుతం ఒక క్లయింట్‌ కుటుంబానికి వార్షిక ఫీజు పరిమితి రూ.1,51,000. ఆస్తుల విలువలో అయితే ఏటా 2.5 శాతం మించకూడదు’’అని సెబీ పేర్కొంది.  

పెట్టుబడి సలహాదారులు సలహా సేవలకు మాత్రమే చెల్లింపులను అంగీకరించగలరని, క్లయింట్ల తరపున వారి ఖాతాల్లోకి నిధులు లేదా సెక్యూరిటీలను స్వీకరించడం నిషేధించినట్లు కూడా మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి.  "రీసెర్చ్‌ అనలిస్టులు వారి ట్రేడింగ్, డీమ్యాట్ లేదా బ్యాంక్ ఖాతాల కోసం క్లయింట్‌కు సంబంధించిన లాగిన్ వివరాలు లేదా ఓటీపీలను అడగకూడదు. అటువంటి సమాచారాన్ని ఆర్‌ఏలతో సహా ఎవరితోనూ పంచుకోవద్దని క్లయింట్లకు సూచిస్తున్నాం" అని సర్క్యులర్ స్పష్టంగా పేర్కొంది. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)