Breaking News

మెరుగైన సమాచార లభ్యతపై దృష్టి

Published on Mon, 08/12/2024 - 08:33

సెక్యూరిటీస్‌ మార్కెట్లో ఇన్వెస్టర్లకు మెరుగైన, సరైన సమాచారం లభించేలా చూడటంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మరింతగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా పర్ఫార్మెన్స్‌ వేలిడేషన్‌ ఏజెన్సీ (పీవీఏ), డేటా బెంచ్‌మార్కింగ్‌ ఇన్‌స్టిట్యూషన్‌ (డీబీఐ) అనే రెండు కొత్త సంస్థలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది.

ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్లు (ఐఏ), రీసెర్చ్‌ అనలిస్టులు (ఆర్‌ఏ), ఆల్గోరిథం ప్రొవైడర్లు తాము అందించే సర్వీసుల పనితీరుకు సంబంధించి తెలియజేసే వివరాలను పీవీఏ నిర్ధారిస్తుంది. ఇక, వివిధ అసెట్‌ క్లాస్‌లకు సంబంధించి ప్రామాణికంగా ఉన్న, పోల్చి చూసుకోతగిన డేటాను అందించే సెంట్రల్‌ రిపాజిటరీగా డీబీఏ పని చేస్తుంది. 2023–24 వార్షిక నివేదికలో సెబీ ఈ విషయాలు వెల్లడించింది. మరోవైపు, ఇన్వెస్టర్లు చెల్లించే ఫీజులు కచ్చితంగా రిజిస్టర్డ్‌ ఐఏలు, ఆర్‌ఏలకే అందే విధంగా ఒక ప్రత్యేకమైన వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సెబీ పేర్కొంది.

ఇదీ చదవండి: అంతర్జాతీయ పరిణామాలు కీలకం

అన్‌రిజిస్టర్డ్‌ సంస్థలను ఇన్వెస్టర్లు గుర్తించేందుకు, వాటికి దూరంగా ఉండేందుకు ఈ విధానం ఉపయోగపడగలదని సెబీ తెలిపింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రియల్‌ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగానికి పెట్టుబడుల లభ్యతకు తోడ్పడే విధానాలపై దృష్టి పెట్టనున్నట్లు వివరించింది. ఈ విషయంలో మార్కెట్‌ వర్గాల అవసరాలను తెలుసుకోవడానికి రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్టులు (రీట్స్‌), ఇన్‌ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్టుల (ఇన్వీట్స్‌) కోసం అడ్వైజరీ కమిటీ వేస్తున్నట్లు పేర్కొంది. వీటితో పాటు స్వచ్ఛంద డీలిస్టింగ్‌ నిబంధనలను సమీక్షించడం తదితర చర్యలు కూడా తీసుకోనున్నట్లు సెబీ తెలిపింది.

Videos

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)