Breaking News

వదంతులపై స్పందించే గడువు పెంపు

Published on Sat, 01/27/2024 - 05:51

న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్లో వ్యాపించే వదంతులపై తప్పనిసరిగా స్పందించాల్సిన గడువును క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పొడిగించింది. దీంతో టాప్‌–100 లిస్టెడ్‌ కంపెనీలకు వెసులుబాటు లభించింది. వెరసి మార్కెట్లో పుట్టే రూమర్లను ధ్రువ పరచడం, ఖండించడం లేదా స్పష్టతనివ్వడం వంటి చర్యలను తప్పనిసరిగా చేపట్టాలనే నిబంధన అమలుకు మరింత గడువు లభించింది.

సెబీ ప్రతిపాదిత ఈ నిబంధనలు తొలుత టాప్‌ ర్యాంక్‌లోని 100 లిస్టెడ్‌ కంపెనీలకు అమలుకానున్న సంగతి తెలిసిందే. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ)రీత్యా అగ్రభాగంలో నిలిచే 100 కంపెనీలు 2024 ఫిబ్రవరి 1 నుంచి రూమర్లపై తప్పనిసరిగా స్పందించాలంటూ సెబీ ఇంతక్రితం గడువు విధించింది. తాజాగా ఈ డెడ్‌లైన్‌ను జూన్‌ 1వరకూ పొడిగిస్తూ ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది.

ఈ బాటలో మార్కెట్‌ విలువలో టాప్‌–250 ర్యాంకు లిస్టెడ్‌ కంపెనీలకు రూమర్లపై స్పందించాల్సిన నిబంధనలు 2024 డిసెంబర్‌ 1 నుంచి అమలుకానున్నాయి. నిజానికి 2024 ఆగస్ట్‌ 1 నుంచి నిబంధనలు అమలు చేయవలసిందిగా టాప్‌–250 సంస్థలను సెబీ గతంలో ఆదేశించింది. లిస్టెడ్‌ కంపెనీలు కార్పొరేట్‌ పాలనను మరింత పటిష్టంగా అమలు చేసే లక్ష్యంతో సెబీ తాజా నిబంధనలకు తెరతీసిన విషయం విదితమే. 

Videos

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)