Breaking News

సెబీ చీఫ్‌పై మరోసారి కాంగ్రెస్‌ ఆరోపణలు

Published on Sun, 09/15/2024 - 12:16

సెబీ చీఫ్‌ మాధబి పురీ బుచ్‌ పనితీరుపై కాంగ్రెస్‌ మరోసారి విరుచుకుపడింది. 2017-23 మధ్యకాలంలో రూ.36.9 కోట్ల విలువైన లిస్టెడ్ సెక్యూరిటీల్లో ట్రేడింగ్ చేశారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా ఆరోపించారు. ఆమె సంస్థ పూర్తికాల డైరెక్టర్‌గా నియమితులైన తర్వాత ఈ వ్యవహారం జరిగిందని చెప్పారు. ఇది సెబీ నిబంధనలను బేఖాతరు చేయడమేనన్నారు. మాధబి సెబీ నియమాలను ఉల్లంఘించడంతోపాటు చైనీస్ ఫండ్‌ల్లో పెట్టుబడులు, విదేశాల్లో ఆస్తులను కలిగి ఉన్నారని తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘2017-21 సంవత్సరాల మధ్య మాధబి పురీ బచ్‌కి విదేశీ ఆస్తులు ఉన్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మొదటిసారిగా ఆమె ఏ ప్రభుత్వ సంస్థకు ఎప్పుడు తెలియజేసిందో ప్రకటించాలి. సింగపూర్‌లోని అగోరా పార్ట్‌నర్స్‌తో మాధబి బ్యాంక్ అకౌంట్‌పై సంతకం చేసింది నిజమో కాదో చెప్పాలి. వాన్‌గార్డ్ టోటల్ స్టాక్ మార్కెట్‌ ఈటీఎఫ్, ఏఆర్‌కే ఇన్నోవేషన్ ఈటీఎఫ్‌, గ్లోబల్ ఎక్స్ ఎంఎస్‌సీఐ చైనా కన్స్యూమర్, ఇన్వెస్కో చైనా టెక్నాలజీ ఈటీఎఫ్‌ల్లో ఈమె పెట్టుబడులు పెట్టారు. సెబీ ఛైర్‌పర్సన్ స్థాయిలో ఉన్న వ్యక్తి చైనాలో పెట్టుబడులు పెట్టడం నిజంగా ఆందోళనకరం’ అని చెప్పారు. భారత్‌, చైనా సంబంధాలపై స్పందిస్తూ చైనా ఉత్పత్తులను వాడకూడదని ఉపన్యాసాలు ఇచ్చే ప్రధాని చైనా నుంచి పీఎం కేర్స్‌ విభాగం ఎందుకు నిధులు పొందుతోందో చెప్పాలన్నారు.

అదానీ కంపెనీలో పెట్టుబడులు

సింగపూర్‌, మారిషస్‌లకు చెందిన డొల్ల కంపెనీల ద్వారా మాధబి అదానీ గ్రూప్‌ల్లో పెట్టుబడి పెట్టారని ఇటీవల  హిండెన్‌బర్గ్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆమె 2017 నుంచి 2024 మధ్య ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.12 కోట్లకు పైగా వేతనం తీసుకున్నారని గతంలో కాంగ్రెస్‌ ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. ప్రముఖ సంస్థకు చీఫ్‌గా వ్యవహరిస్తూ వేరే సంస్థ నుంచి వేతనం తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమన్నారు. మార్కెట్‌ రెగ్యులేటరీ సంస్థ సెబీ చీఫ్‌పై ఇలా ఆరోపణలు రావడంపై ట్రేడర్లు, పెట్టుబడిదారుల్లో ఆందోళనలు నెలకొంటున్నాయి.

ఇదీ చదవండి: ఈ ఏడాది భారీగా ఉద్యోగాలు ఇచ్చే రంగం

ఉద్యోగుల ఫిర్యాదు

సెబీ అధికారులు ఇటీవల సంస్థ చీఫ్‌ పనితీరుపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసినట్లు కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి. ఫిర్యాదులోని వివరాల ప్రకారం మాధబి కిందిస్థాయి ఉద్యోగులతో సమావేశాల్లో అరవడం, తిట్టడం, బహిరంగంగా అవమానిస్తున్నట్లు తెలిపారు. అసిస్టెంట్‌ మేనేజర్‌ ఆపై స్థాయి సిబ్బంది మొత్తం సెబీలో 1000 మంది ఉన్నారు. అందులో 500 మంది వరకు ఈ ఫిర్యాదు లేఖపై సంతకాలు చేశారు.

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)