Breaking News

యూరప్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. షెంజెన్‌ వీసా ధరలు పెరిగాయ్

Published on Sun, 08/24/2025 - 06:58

షెంజెన్‌ వీసా (schengen visa) దరఖాస్తులు మరింత ఖరీదైనవిగా మారాయి. దీనివల్ల భారతీయులకు యూరప్ ప్రయాణాల ఖర్చు పెరిగింది. చాలా యూరోపియన్ దేశాలకు వీసా సమర్పణలను నిర్వహించే ప్రైవేట్ ఏజెన్సీ వీఎఫ్ఎస్ గ్లోబల్ తన సర్వీస్ ఛార్జీలను పెంచడంతో ధరలు పెరిగాయి.

2023 తర్వాత ధరలు పెరగడం ఇదే మొదటిసారి. పెద్దలకు బేస్ షెంజెన్‌ వీసా ఫీజు దాదాపు రూ. 8,000 - రూ. 10,000 వరకు ఉన్నప్పటికీ.. VFS అదనపు సర్వీస్ ఫీజును వసూలు చేస్తుంది. దీనివల్ల వల్ల మొత్తం ఖర్చు పెరుగుతుంది. ఈ కొత్త సర్వీస్ ఫీజు దేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. జర్మనీ ఇప్పుడు రూ.1933, స్విట్జర్లాండ్ రూ.2690, పోర్చుగల్ రూ.3111, ఫ్రాన్స్ రూ.2234, ఆస్ట్రియా రూ.2274 వసూలు చేస్తున్నాయి.

కొరియర్ డెలివరీ, ఎస్ఎమ్ఎస్ అప్‌డేట్‌లు, ప్రీమియం లాంజ్ యాక్సెస్ వంటి సేవలకు అదనంగా చెల్లించడాన్ని కూడా దరఖాస్తుదారులు ఎంచుకోవచ్చు. దేశాన్ని బట్టి ఈ ఛార్జీలు కూడా మారుతూ ఉంటాయి. ప్రస్తుతం వీఎఫ్ఎస్ గ్లోబల్ స్విట్జర్లాండ్‌కు ఈ పెరుగుదలను ధృవీకరించింది. కానీ ఇతర దేశాలకు ఫీజులు మారాయా?, లేదా?.. అనే విషయం మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

షెంజెన్‌ వీసా కలిగిన ప్రయాణికులు 180 రోజుల వ్యవధిలో 90 రోజుల వరకు 29 యూరోపియన్ దేశాలను సందర్శించడానికి అనుమతిస్తుంది. దీనికోసం దరఖాస్తుదారులు ట్రావెల్ ప్లాన్, ఇన్సూరెన్స్ వంటి వాటితోపాటు ఫైనాన్సియల్ ప్రూఫ్ వంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్‌కు పోటీగా మాక్రోహార్డ్?: ఎలాన్ మస్క్ ప్లాన్ ఇదేనా..

కరెన్సీ హెచ్చుతగ్గులు కూడా యూరప్ పర్యటనల ఖర్చు పెరగడానికి మరోకారణం అని తెలుస్తోంది. గత దశాబ్ద కాలంలో రూపాయి బాగా బలహీనపడింది. 2015లో ఒక యూరో ధర రూ.72.12గా ఉంది. 2020లో ఇది రూ.84.64కి పెరిగింది. 2023 నాటికి రూ.89.20కు చేరింది. 2024లో దీని విలువ రూ. 90.55గా ఉంది. కాగా జూన్ 2025లో యూరో విలువ మొదటిదారిగా రూ. 100 దాటిపోయింది. ఇది భారతీయ సందర్శకులకు యూరోపియన్ ప్రయాణ ఖర్చును మరింత పెంచింది.

#

Tags : 1

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)