Breaking News

తక్కువ టెన్యూర్‌.. ఎక్కువ వడ్డీ!

Published on Sun, 04/14/2024 - 08:15

తక్కువ టెన్యూర్‌ ఉండి ఎక్కువ వడ్డీ వచ్చే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం కోసం చూస్తున్నారా..  మీలాంటివారి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎస్‌బీఐ సర్వోత్తం ఎఫ్‌డీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో 1 లేదా 2 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి. ఇతర పథకాలతో పోలిస్తే, ఇది అధిక వడ్డీని అందిస్తుంది. 

రెండేళ్ల టెన్యూర్‌
ఈ  సర్వోత్తం ఎఫ్‌డీ పథకంపై ఎస్‌బీఐ 7.4 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ వడ్డీ పీపీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీ, పోస్ట్ ఆఫీస్ స్కీమ్ వంటి ఇతర పెట్టుబడి ఎంపికల కంటే ఎక్కువ. ఇది కాకుండా ఈ పథకం అతిపెద్ద ఫీచర్‌ ఏంటంటే.. దాని కాలవ్యవధి. ఈ పథకం టెన్యూర్‌ 1 లేదా 2 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. 2 సంవత్సరాల ఎఫ్‌డీపై సాధారణ ప్రజలకు 7.4 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.90 శాతం వడ్డీని ఎస్‌బీఐ అందిస్తోంది.

ఏడాది టెన్యూర్‌
ఎస్‌బీఐ సర్వోత్తం ఎఫ్‌డీ పథకంపై 1 సంవత్సరం కాలపరిమితితో సాధారణ ప్రజలకు 7.10 శాతం వడ్డీని అందిస్తోంది. అలాగే సీనియర్ సిటిజన్‌లు 7.60 శాతం వడ్డీని పొందవచ్చు.

పెట్టుబడి పరిమితి
ఎస్‌బీఐ సర్వోత్తం ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీంలో ఇన్వెస్టర్ కనీసం రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ.2 కోట్ల పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో డిపాజిట్‌దారు 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాల కాలపరిమితిని ఎంచుకోవచ్చు.

పదవీ విరమణ చేసిన వారికి ఎస్‌బీఐ సర్వోత్తం ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం ఉత్తమమైనదని చెప్పవచ్చు. పీపీఎఫ్‌ నుండి డబ్బు పొందినప్పుడు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఈ పథకంలో రూ.2 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెడితే వచ్చే వడ్డీ 0.05 శాతం తగ్గుతుంది.

(Disclaimer: ఈ సమాచారం పాఠకుల అవగాహన కోసం మాత్రమేనని గమనించగలరు. ఏదైనా ఎఫ్‌డీ పథకంలో పెట్టుబడి పెట్టే ముందు దాని క్షుణ్ణంగా తెలుసుకోవడం అవసరం)
 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)