Breaking News

పంట బీమా పంపిణీకి ప్రత్యేక కార్యక్రమం

Published on Sat, 02/15/2025 - 14:10

దేశంలోని ప్రముఖ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో ఒకటైన ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ (SBI General Insurance)  ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద రైతులకు పంట బీమా పాలసీలను అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖతో కలిసి పాలసీలను రైతుల ముంగిటకు చేర్చే ‘మేరీ పాలసీ మేరే హాథ్’ అనే ప్రచార కార్యక్రమంలో పాల్గొంటోంది.

‘మేరీ పాలసీ మేరే హాథ్’ కార్యక్రమం ఫిబ్రవరి 1 నుండి మార్చి 15 వరకు జరగనుంది. ఇందులో భాగంగా రైతులకు వారి ఇంటి వద్దనే భౌతికంగా పంట బీమా పాలసీ పత్రాలను అందజేస్తారు. రైతులలో పంట బీమా ప్రయోజనాలపై అవగాహన పెంచడానికి, నిరాటంకమైన పంట బీమా అనుభవం అందించేందుకు ఈ కార్యక్రమం రూపొందించారు.

‘మేరీ పాలసీ మేరే హాథ్’ కార్యక్రమం ముఖ్యంగా పంట బీమా ప్రక్రియలో పారదర్శకతను పెంచడంపై దృష్టి సారిస్తుంది. పంట నష్టాలు వాటిల్లిన పక్షంలో వెంటనే నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్, సెంట్రల్ టోల్ ఫ్రీ నంబర్ 14447 వంటి వాటి ద్వారా సమాచారం అందించేలా రైతులను చైతన్యపరుస్తుంది. ఇందులో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

“పీఎంఎఫ్‌బీవై కింద రైతులకు పంట బీమా ప్రయోజనాలను సులభంగా అందించేందుకు ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కట్టుబడి ఉంది. ఆర్థిక భద్రత, నిశ్చింతను రైతులకు అందించడం, రిస్కులను అధిగమించడంలో వారికి సహాయం చేయడమే మా లక్ష్యం. ‘మేరీ పాలసీ మేరే హాథ్’ క్యాంపెయిన్‌ ద్వారా స్థానిక అడ్మినిస్ట్రేషన్లు, భాగస్వాములు, రైతులతో కలిసి సమర్ధవంతంగా, ప్రభావవంతంగా పాలసీల పంపిణీకి మా నిబద్ధతను తెలియజేస్తున్నాము” అని ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో నవీన్ చంద్ర ఝా పేర్కొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)