Breaking News

ఎస్‌బీఐ జనరల్‌ లాభం రూ. 509 కోట్లు

Published on Thu, 04/24/2025 - 13:22

ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2024–25) ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. నికర లాభం రెట్టింపునకుపైగా జంప్‌చేసి రూ. 509 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2023–24) కేవలం రూ. 240 కోట్లు ఆర్జించింది.

స్థూల ప్రీమియం ఆదాయం(జీడబ్ల్యూపీ) సైతం 11 శాతం ఎగసి రూ. 14,140 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది రూ. 12,731 కోట్ల జీడబ్ల్యూపీ సాధించింది. కంపెనీ సాల్వెన్సీ రేషియో ఆర్థిక పటిష్టతను సూచిస్తూ 2ను మించింది. నిబంధనల ప్రకారం 1.5 నిష్పత్తిని మించింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐకు సాధారణ బీమా రంగ అనుబంధ సంస్థ ఇది.

హెల్త్ ఇన్సూరెన్స్ విభాగం 19.2 శాతం, మోటార్ ఇన్సూరెన్స్ 31.2 శాతం వృద్ధిని నమోదు చేసుకోవడంతో కంపెనీ పటిష్టమైన పనితీరు కనబరిచింది. మెరైన్ కార్గో, ఇంజినీరింగ్, కమర్షియల్ లైన్స్ సహా ఇతర విభాగాలు కూడా బీమా కంపెనీ వృద్ధికి ఊతమిచ్చాయి.

ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓ నవీన్ చంద్ర ఝా మాట్లాడుతూ ‘2025 ఆర్థిక సంవత్సరం పనితీరు కస్టమర్ సర్వీస్, వృద్ధి, లాభదాయకత పట్ల మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. జీడబ్ల్యూపీ వృద్ధి 11.1 శాతం, పీఏటీలో 2.1 రెట్లు పెరుగుదలతో, మేము మార్కెట్ కంటే వేగంగా అభివృద్ధి చెందుతున్నాం’ అ​న్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)