Breaking News

సౌదీ అరామ్‌కో లాభం రికార్డ్‌

Published on Mon, 03/13/2023 - 00:27

దుబాయ్‌: గ్లోబల్‌ చమురు దిగ్గజం సౌదీ అరామ్‌కో గతేడాది(2022) కొత్త చరిత్రను లిఖిస్తూ 161 బిలియన్‌ డాలర్ల(రూ. 13 లక్షల కోట్లకుపైగా) నికర లాభం ఆర్జించింది. వెరసి ఏడాది కాలంలో ఆర్జించిన లాభాలరీత్యా లిస్టెడ్‌ కంపెనీలలో సరికొత్త రికార్డును సాధించింది. సౌదీ అరామ్‌కోగా పిలిచే సౌదీ అరేబియన్‌ ఆయిల్‌ కో కొద్ది నెలలుగా చమురు ధరలు జోరందుకోవడంతో తాజా ఫీట్‌ను సాధించింది. ప్రధానంగా 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించడం ఇందుకు సహకరించింది. రష్యా చమురు, నేచురల్‌ గ్యాస్‌ అమ్మకాలపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడం ప్రభావం చూపింది.

కంపెనీ జనవరి–డిసెంబర్‌ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. 2021లో సాధించిన 110 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే నికర లాభం 46 శాతంపైగా ఎగసింది. కాగా.. కోవిడ్‌–19 సంక్షోభం తదుపరి ఇటీవల చైనా ఆంక్షలు సడలించడంతో చమురుకు డిమాండ్‌ మరింత ఊపందుకోనున్నట్లు సౌదీ అరామ్‌కో భావిస్తోంది. వెరసి ఉత్పత్తిని పెంచే యోచనలో ఉంది. అయితే మరోపక్క వాతావరణ మార్పులకు కారణమవుతున్న శిలాజ ఇంధనాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. శిలాజ ఇంధనాల విక్రయం ద్వారా ఒక కంపెనీ 161 బిలియన్‌ డాలర్లు ఆర్జించడం షాక్‌కు గురిచేసినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సెక్రటరీ జనరల్‌ ఏన్స్‌ కాలమార్డ్‌ వ్యాఖ్యానించారు.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు