Breaking News

భారతీయులకు శుభవార్త.. సౌదీ వెళ్లడానికి కొత్త ఎంట్రీ వీసాలు

Published on Fri, 07/05/2024 - 20:53

సౌదీ అరేబియా పర్యాటకాన్ని పెంచే దిశగా భారతీయ పౌరుల కోసం కొత్త వీసా ఎంపికలను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఇందులో స్టాప్‌ఓవర్ వీసాలు, ఈవీసాలు, వీసా ఆన్ అరైవల్‌ వంటివి ఉన్నాయి. 2024 చివరి నాటికి సౌదీ అరేబియాను సందర్శించే భారతీయ పర్యాటకుల సంఖ్య 20 లక్షల కంటే ఎక్కువ ఉండాలని ఈ కొత్త వీసాలను ప్రవేశపెట్టడం జరిగింది.

భారతీయులు ఇప్పుడు స్టాప్‌ఓవర్ వీసా కోసం అప్లై చేసుకోవచ్చు. ఇది గరిష్టంగా 96 గంటలు చెల్లుతుంది. ఈ వీసాను సౌదియా ఎయిర్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా 90 రోజులు ముందుగానే పొందవచ్చు. దీనికోసం నామినల్ ఫీజు వంటివి చెల్లించాల్సి ఉంటుంది.

యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్ లేదా స్కెంజెన్ దేశం నుంచి చెల్లుబాటు అయ్యే పర్యాటక లేదా వ్యాపార వీసాలను కలిగి ఉన్న భారతీయ పౌరులు ఈవీసా పొందటానికి అర్హులు. ఈ దేశాలలో శాశ్వత నివాసితులు లేదా సౌదీ అరేబియాలోకి ప్రవేశించిన తేదీ కంటే కనీసం మూడు నెలల చెల్లుబాటు అయ్యే నివాస వీసా ఉన్న వ్యక్తులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈవీసా అధికారిక పోర్టల్ ద్వారా దీనిని పొందవచ్చు.

ఈవీసా కోసం అవసరమైన ప్రమాణాలు ఉన్నవారు.. వీసా ఆన్ అరైవల్‌ కూడా పొందవచ్చు. యూఎస్, యూకే, స్కెంజెన్ దేశాల నుంచి చెల్లుబాటు అయ్యే పర్యాటక లేదా వ్యాపార వీసాలు కలిగిన వారికి మాత్రమే కాకుండా ఈ దేశాలలో శాశ్వత నివాసితులకు వీసా ఆన్ అరైవల్‌ పొందవచ్చు. దీని కోసం సౌదీ విమానాశ్రయాల్లోని సెల్ఫ్-సర్వీస్ కియోస్క్‌లు లేదా పాస్‌పోర్ట్ కార్యాలయాల్లో అప్లై చేసుకోవచ్చు.

సౌదీ అరేబియా భారతీయ పౌరుల కోసం అందిస్తున్న ఈ వీసాల కోసం.. ముంబై, ఢిల్లీ, కొచ్చిన్, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగుళూరు, లక్నో, కోల్‌కతా, కాలికట్‌లలోని 10 వీసా ఫెసిలిటేషన్ కేంద్రాలలో అప్లై చేసుకోవచ్చు. ఇవి కాకుండా మరిన్ని నగరాల్లో కూడా ప్రత్యేక కేంద్రాలను ప్రారంభించే అవకాశం ఉంది. సౌదీ విజన్ 2030లో భాగంగా 2030నాటికి 75 లక్షల మంది ప్రయాణికులను సౌదీ అరేబియా ఆహ్వానించనుంది. 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)