Breaking News

ఒకే స్కూల్‌కు రూ.300 కోట్లు విరాళం ఇచ్చిన సీఈఓలు

Published on Sat, 08/16/2025 - 09:28

విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల అభివృద్ధి కోసం రూ.వందలు, రూ.వేలు, రూ.లక్షల్లో.. విరాళం ఇవ్వడం సహజంగా చూస్తూంటాం. కానీ తమను అంతటివారిని చేసిన బడి కోసం ఏకంగా రూ.300 కోట్లు విరాళం ఇచ్చి వార్తల్లో నిలిచారు. ఇంతకీ వారు ఎవరని అనుకుంటున్నారా.. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ అజయ్ బంగా, ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ ఛైర్మన్ ప్రేమ్ వత్స. ఇంతకీ వారు విరాళం ఇచ్చిన, వారు చదివిన పాఠశాల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్‌పీఎస్‌).

హెచ్‌పీఎస్‌లోని మౌలిక సదుపాయాలను ఆధునీకరించడానికి, ఉన్న సదుపాయాలను మరింత విస్తరించడానికి ఈ విరాళం ప్రకటించారు. ఈ సహకారం పూర్వ విద్యార్థుల నేతృత్వంలో భారతదేశంలోని అతిపెద్ద విద్యా విరాళాల్లో ఒకటిగా నిలిచింది. క్రెడాయ్ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విరాళానికి సంబంధించిన వివరాలు పంచుకుంటూ సదరు సీఈఓలను ప్రశంసించారు. తాము చదువుకున్న నగరానికి, పాఠశాలకు తిరిగి సాయం చేయాలనుకుంటున్నట్లు సీఎం చెప్పారు.

ఇదీ చదవండి: రక్షణ రంగంలో స్టార్టప్‌లతో స్వావలంబన

ఈ నిధులను కొత్త అకడమిక్ బ్లాక్ నిర్మాణానికి, ఇప్పటికే ఉన్న కొన్ని తరగతి గదులను పునరుద్ధరించడానికి వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రణాళిక పాఠశాల విస్తృత విజన్ 2050కు అనుగుణంగా ఉందని చెప్పారు. ఈ శతాబ్దం మధ్య కాలం నాటికి హెచ్‌పీఎస్‌ను ప్రపంచంలోని టాప్-10 పాఠశాలల్లో ఒకటిగా ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈమేరకు రెండు సంవత్సరాల క్రితం జరిగిన శతాబ్ది ఉత్సవాల్లోనే నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. రూ.150 కోట్లతో రూపొందించిన విజన్ 2050 బ్లూప్రింట్‌లో అకడమిక్ అప్‌గ్రేడ్స్‌, గ్లోబల్ పార్టనర్‌షిప్స్‌, స్పోర్ట్స్ ఎక్సలెన్స్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి. 1923లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ను స్థాపించారు.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)