Breaking News

సత్య సారథ్యంలో సమూల మార్పులు!

Published on Fri, 12/19/2025 - 13:05

సాఫ్ట్‌వేర్ రంగంలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయిస్తోన్న మైక్రోసాఫ్ట్ ఇప్పుడు అత్యంత కీలకమైన పరివర్తనకు సిద్ధమైంది. కృత్రిమ మేధ (ఏఐ) కేవలం ఒక ఫీచర్‌గా మాత్రమే కాకుండా కంపెనీ ఉనికికి పునాదిగా మారుతోందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కంపెసీ సీఈఓ సత్య నాదెళ్ల నాయకత్వంలో మైక్రోసాఫ్ట్ తన పనితీరును, సంస్కృతిని, భవిష్యత్తు వ్యూహాలను పూర్తిగా ప్రక్షాళన చేస్తోంది.

బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం, మైక్రోసాఫ్ట్ ఇకపై ఏఐని కేవలం ఉత్పత్తులకు అదనపు హంగుగా చూడటం లేదు. భవిష్యత్తులో రాబోయే ప్రతి ఉత్పత్తిని ఏఐ ఆధారంగానే తయారు చేయాలని భావిస్తుంది. ప్రస్తుత ఏఐ ప్రభావాన్ని ఒక ‘అరుదైన క్షణం’గా సత్య నాదెళ్ల అభివర్ణించారు. ఇది కేవలం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ వంటిది కాదని, కంపెనీకి ఇదో పూర్తి రీఇన్వెన్షన్‌గా మారే సమయమని అంతర్గత వర్గాలకు స్పష్టం చేశారు.

పాత పద్ధతులకు స్వస్తి

‘కంపెనీ ఉత్పత్తుల పరంగా చేసే పనుల్లో సత్య వేగాన్ని, అత్యవసరాన్ని (Urgency) కోరుకుంటున్నారు’ అని ఒక మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు. ఈ వేగాన్ని అందుకోలేక పాత పని పద్ధతులకు అలవాటు పడిన కొందరు సీనియర్ ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ ఏఐ విప్లవంలో భాగస్వాములు కావాలా లేదా అన్నది తేల్చుకోవాలని నాదెళ్ల పరోక్షంగా హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. ‘మీరు దీన్ని ఎంతకాలం, ఎంత నిబద్ధతతో చేయాలనుకుంటున్నారో మీరే ప్రశ్నించుకోవాలి’ అని ఏఐలో వస్తున్న మార్పుల దృష్ట్యా ఉద్యోగులను ఉద్దేశించి ఆ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. ఉత్పత్తుల నిర్వహణలో జాప్యాన్ని తగ్గించడానికి నాదెళ్ల ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగుతున్నారు. మేనేజ్‌మెంట్ వ్యవస్థలపై ఆధారపడకుండా ఆయన నేరుగా ఇంజినీర్లు, ఇతర బృందాలతో సమావేశమవుతున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: కొందరి చేతుల్లోనే పోగవుతున్న ధనలక్ష్మీ

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)