Breaking News

శాంసంగ్ కొత్త ఎత్తు! వెనక్కితగ్గని ఉద్యోగులు

Published on Fri, 10/04/2024 - 16:44

చెన్నైలోని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌లో కార్మికులు సమ్మె చే​స్తున్నారు. మెరుగైన వేతనాలు, తమ యూనియన్‌కు గుర్తింపు కోసం దాదాపు నెల రోజులుగా నిరసనలు చేస్తున్నారు. సమ్మె ఆపాలని యాజమాన్యం ఎంత హెచ్చరించినా వెనక్కితగ్గడం లేదు. దీంతో కంపెనీ కొత్త ఎత్తు వేసింది.

శాంసంగ్ ఇండియా వర్కర్స్ యూనియన్-సీఐటీయూ నేతృత్వంలో ఉద్యోగులు చేస్తున్న సమ్మెతో గృహోపకరణాల విక్రయానికి కీలకమైన పండుగ సీజన్‌కు ముందు ఉత్పత్తి 80 శాతం తగ్గిపోయింది. సమ్మె ఇప్పుడు నాల్గవ వారానికి చేరుకోవడంతో ఉద్యోగుల కుటుంబాలను మచ్చిక చేసుకుని సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు వారి ఇళ్లకు ‘స్నాక్ కిట్‌’లను పంపుతోందని ఫ్రంట్‌లైన్ నివేదించింది.

తమిళనాడులోని శాంసంగ్ ప్లాంట్‌లో దాదాపు 1,800 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 1,000 మందికి పైగా కార్మికులు సెప్టెంబర్ 9 నుండి సమ్మెలో ఉన్నారు. తమ యూనియన్‌ను గుర్తించాలని, మూడేళ్ల జీతం రూ.36,000 పెంచాలని, షిఫ్ట్ అలవెన్స్‌ను రూ.150 నుండి రూ.250కి పెంచాలని, పితృ సెలవులను మూడు నుండి ఏడు రోజులకు పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే సమానమైన అర్హతలు, విధులు ఉన్న కార్మికులకు సమాన వేతనం అమలుచేయాలని కోరుతున్నారు.

2007లో ఇక్కడ ఏర్పాటైన శాంసంగ్‌ ఇండియా ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ గత 16 సంవత్సరాలుగా యూనియన్ లేకుండా పని చేస్తోంది.శాంసంగ్ ఇండియా వర్కర్స్ యూనియన్, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ మద్దతుతో గత సంవత్సరం ఏర్పడింది. అయితే దీనికి కంపెనీ నుండి అధికారిక గుర్తింపు లేదు.

కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి యాజమాన్యం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. నిరసనను కొనసాగిస్తే వేతనాలు ఆపేస్తామని, విధుల నుంచి తొలగిస్తామని గత నెలలో కంపెనీ హెచ్చరించినట్లు రాయిటర్స్ నివేదించింది. ఇప్పుడు ఉద్యోగుల కుటుంబాలను మచ్చిక చేసుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా వారికి పండ్లు, చాక్లెట్‌లతో కూడిన స్నాక్ కిట్‌లను పంపుతోంది. అంతేకాకుండా కంపెనీ ప్రతినిధులు నేరుగా కార్మికుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్లుగా ఫ్రంట్‌లైన్‌ పేర్కొంది. అయితే ఈ వార్తలను శాంసంగ్‌ యాజమాన్యం ఖండించింది.
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)