Breaking News

సరికొత్త రికార్డ్స్‌.. 24 గంటల్లో 1.4 లక్షల ఫోన్‌ల బుకింగ్స్‌!

Published on Tue, 02/07/2023 - 15:10

దేశీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో శాంసంగ్‌ సత్తా చాటుతోంది. ఆ సంస్థకు చెందిన గెలాక్సీ ఎస్‌ 23 ఫోన్‌లు ప్రీ బుకింగ్‌లో దుమ్మురేపుతున్నాయి. ఒక్కరోజులోనే రూ.1400 కోట్ల విలువైన 1.4 లక్షల యూనిట్ల ప్రీమియం ఫోన్‌లను కొనుగోలు దారులు బుక్‌ చేసుకున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. 

శాంసంగ్‌ ఫిబ్రవరి 1న గెలాక్సీ ఎస్‌ 23 సిరీస్‌లోని ‘గెలాక్సీ ఎస్‌23, గెలాక్సీ ఎస్‌23 ప్లస్‌, గెలాక్సీ ఎస్‌23 అల్ట్రా’ అనే మూడు వేరియంట్లు మోడళ్లను అధికారికంగా విడుదల చేసింది. ఫిబ్రవరి 23 వరకు కొనసాగనున్న ప్రీ బుకింగ్‌ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. 

రెండు రెట్లు పెరిగి
ఈ సందర్భంగా శాంసంగ్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజు పుల్లాన్‌ మాట్లాడుతూ.. గతంలో తాము విడుదల చేసిన శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 22 కంటే రెండు రెట్లు పెరిగి సగటున ఫోన్‌ ధర సుమారు లక్ష రూపాయలు ఉన్న ఈ ఫోన్‌లు 24 గంటల్లో 1.4 లక్షల యూనిట్లు ప్రీ బుకింగ్స్‌ జరిగినట్లు చెప్పారు.

ఫిబ్రవరి 23 ప్రీబుకింగ్‌  కొనసాగింపు
ఇక ఈ ఫోన్‌ల ప్రీ బుకింగ్స్‌ ఫిబ్రవరి 23వరకు కొనసాగుతాయని చెప్పిన పుల్లాన్‌ .. శాంసంగ్‌ ఎస్‌ 23 సిరీస్‌ ధరలు రూ.75 వేల నుంచి రూ.1.55లక్షల వరకు ఉన్నాయని అన్నారు. 

భారత్‌లో తయారీ.. ఎక్కడంటే 
దేశీయ మార్కెట్‌లో విడుదలైన శాంసంగ్‌ ఎస్‌ 23 ప్రీమియం ఫోన్‌లు నోయిడా ప్లాంట్‌లో తయారు చేసినట్లు పేర్కొన్నారు. ఇక గెలాక్సీ ఎస్‌ సిరీస్‌ ఫోన్‌లను మాత్రం వియాత్నం మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌లో తయారు చేసి.. దిగుమతి అనంతరం భారత్‌లో అమ్మకాలు జరిపినట్లు వెల్లడించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)