Breaking News

రాజకీయాల్లో డబ్బు విరాళాలపై సామ్ కామెంట్‌

Published on Thu, 06/04/2026 - 12:38

సిలికాన్ వ్యాలీ బిలియనీర్లు, టెక్ దిగ్గజాలు అమెరికా మధ్యంతర ఎన్నికలను ప్రభావితం చేసేందుకు కోట్లాది డాలర్లు కుమ్మరిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ సమయంలో ఓపెన్‌ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సామ్ ఆల్ట్‌మన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2026 యూఎస్ ఎన్నికల్లో(మధ్యంతర) తాను ఎలాంటి రాజకీయ విరాళాలు ఇచ్చే ప్రణాళికలు లేవని ఆయన స్పష్టం చేశారు. వాషింగ్టన్ పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆల్ట్‌మన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో డబ్బు ప్రభావంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ‘సాధారణంగా రాజకీయాల నుంచి డబ్బు దూరం కావాలని నేను కోరుకుంటున్నాను. అది జరిగితే చాలా మంచిది’ అని పేర్కొన్నారు.

తాను స్వయంగా రాజకీయ విరాళాలకు దూరంగా ఉంటున్నప్పటికీ ఏఐ పరిశ్రమపై పెరుగుతున్న వ్యతిరేకతను తట్టుకోవడానికి ప్రచారాలకు డబ్బు పెట్టే ఇతర టెక్ దిగ్గజాల నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. ‘మా పోటీదారులందరి కంటే మమ్మల్ని వేరే ప్రమాణాలతో కొలవడం సరికాదు. వారు మమ్మల్ని తొక్కేయడానికి డబ్బును ఆయుధంగా వాడుతుంటే మేము కూడా తిరిగి పోరాడగలగాలి. అయితే, బోర్డు అంతటా నిబంధనలు అందరికీ ఒకేలా ఉండడానికి నేను ఇష్టపడతాను’ అని ఆల్ట్‌మన్ వ్యాఖ్యానించారు.

సూపర్ పీఏసీల హోరాహోరీ

కృత్రిమ మేధ రంగంలో ఆధిపత్యం కోసం, అనుకూల చట్టాల కోసం సిలికాన్ వ్యాలీలో పొలిటికల్ యాక్షన్ కమిటీల (పీఏసీ) యుద్ధం నడుస్తోంది.

లీడింగ్ ది ఫ్యూచర్: ఓపెన్‌ఏఐ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రోక్‌మన్, సిలికాన్ వ్యాలీ వెంచర్ క్యాపిటల్ సంస్థ ‘ఆండ్రీసెన్ హోరోవిట్జ్’ సహ వ్యవస్థాపకుల మద్దతుతో నడుస్తున్న సూపర్ పీఏసీ ఇది. ఏఐ స్నేహపూర్వక అభ్యర్థులను గెలిపించడం, డేటా సెంటర్ల నిర్మాణంపై రాష్ట్రాల ఆంక్షలను ఎదుర్కోవడం దీని ముఖ్య ఉద్దేశం.

పబ్లిక్ ఫస్ట్ యాక్షన్: ఓపెన్‌ఏఐ ప్రధాన పోటీదారు ‘ఆంత్రోపిక్ పీబీసీ’ ఈ సూపర్ పీఏసీకి ఏకంగా 20 మిలియన్‌ డాలర్ల నిధులు ఇచ్చింది. ఇది కఠినమైన ఏఐ భద్రతా నిబంధనల కోసం వాదిస్తుంది.

ఓపెన్‌ఏఐ వివరణ: లీడింగ్ ది ఫ్యూచర్ పీఏసీకి గ్రెగ్ బ్రోక్‌మన్, ఆయన భార్య అన్నా నుంచి 25 మిలియన్‌ డాలర్ల విరాళాలు అందినప్పటికీ ఆ సంస్థతో తమకు ఎలాంటి అధికారిక అనుబంధం లేదని ఓపెన్‌ఏఐ బ్లాగ్ పోస్ట్‌లో స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: గేదె హెయిర్‌ స్టైల్‌కు ఫుల్‌ క్రేజ్‌!

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు