Breaking News

ట్రంప్‌ ప్రభుత్వానికి ఓపెన్ ఏఐ హెచ్చరిక

Published on Sat, 03/15/2025 - 08:12

కృత్రిమ మేధ (AI) ఆధిపత్యం కోసం ప్రపంచవ్యాప్తంగా పోటీ తీవ్రతరం అవుతున్న తరుణంలో సామ్ ఆల్ట్‌మన్‌ నేతృత్వంలోని ఓపెన్ ఏఐ అమెరికా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. కాపీరైట్ సంస్కరణల్లో నిబంధనల కారణంగా అమెరికన్ కంపెనీలు చాలా వెనుకబడిపోతాయని, చైనీస్ డెవలపర్లు కాపీరైట్ డేటా వినియోగానికి అపరిమిత అవకాశాలు కనుగొంటున్నారని ఓపెన్ఏఐ తెలిపింది. ఈ వ్యత్యాసం ఏఐ రేసులో చైనాను ముందుంచేందుకు వీలు కల్పిస్తుందని వాదించింది. ఇటీవల యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR)కు ఇచ్చిన ప్రకటనలో ఈమేరకు వివరాలు వెల్లడించింది.

టెక్నాలజీపై ఆదిపథ్యం కోల్పోయే ప్రమాదం

‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (పీఆర్సీ) డెవలపర్లకు కాపీరైట్ డేటా వినియోగానికి అపరిమిత అవకాశం ఉంది. అమెరికా కంపెనీలకు అలాంటి అవకాశం లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోటీ ముగిసిందనే చెప్పవచ్చు. నిజమైన ఐపీ క్రియేటర్లకు రక్షణల విషయంలో పెద్దగా ప్రయోజనం లేకపోగా, కీలకమైన సాంకేతిక పరిజ్ఞానంపై ఆధిపత్యం కోల్పోయే ప్రమాదం ఉంది. డేటా సంరక్షణ కోసం యునైటెడ్ స్టేట్స్ ప్రస్తుత విధానం కాపీరైట్ కంటెంట్‌ వినియోగాన్ని పరిమితం చేస్తుంది. అయితే చైనా అటువంటి డేటాను కృత్రిమ మేధ శిక్షణ కోసం స్వేచ్ఛగా ఉపయోగిస్తోంది. ఇది చైనా ఏఐ సంస్థలను నిబంధనలకు విరుద్ధంగా ఈ పోటీలో ముందుంచుతుంది’ అని ఓపెన్‌ఏఐ తెలిపింది.

డేటాను యాక్సెస్‌ చేయడం వల్ల మరిన్ని ఆవిష్కరణలు

ఇటీవల ముగిసిన పబ్లిక్ కామెంట్ పీరియడ్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏఐ యాక్షన్ ప్లాన్‌పై ‘ఫ్రీడమ్‌-ఫోకస్డ్‌’కు సంబంధించి ఓపెన్ఎఐ సిఫార్సులను అందించింది.  ఏఐ పరిశ్రమలో ‘నేర్చుకునే స్వేచ్ఛ’ను ప్రోత్సహించడానికి తన కాపీరైట్ వ్యూహాన్ని మార్చడం ద్వారా అమెరికా మరింత ముందంజలో ఉంటుందని తెలిపింది. లేదంటే పీఆర్సీలు యూఎస్ కంపెనీలు యాక్సెస్ చేయలేని కాపీరైట్ డేటాను వినియోగించి ఈ విభాగంలో దూసుకుపోతాయని పేర్కొంది. సాధ్యమైనంత విస్తృత శ్రేణి వనరుల నుంచి ఎక్కువ డేటాను యాక్సెస్ చేయడం వల్ల మరింత శక్తివంతమైన ఆవిష్కరణలకు అవకాశం లభిస్తుందని, ఇది మరింత జ్ఞానాన్ని అందిస్తుందని ఓపెన్‌ఏఐ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: రాత్రిపూట రైళ్లు ఎందుకు వేగంగా నడుస్తాయి?

ఇప్పటికైతే ముందువరుసలో అమెరికానే..

ఇటీవల యాపిల్ యాప్ స్టోర్‌లో చాట్‌జీపీటీని అధిగమించిన చైనీస్ ఏఐ మోడల్ డీప్‌సీక్‌ ఆర్1 వంటి ఏఐలతో అమెరికా ఏఐ ఆదిపత్యానికి ముప్పు పొంచి ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓపెన్ఏఐ ఈ వ్యాఖ్యలు చేసింది. ఇప్పటివరకైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అమెరికా ముందంజలో ఉండగా, డీప్‌సీక్‌ మాత్రం తమ ఆధిక్యం విస్తృతంగా లేదని, కుంచించుకుపోతున్నట్లు చూపిస్తోందని ఓపెన్ ఏఐ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఏఐ ఆధిపత్యాన్ని బలోపేతం చేయడానికి కాపీరైట్ డేటా వినియోగించుకునేందుకు వీలుగా మరిన్ని మార్పులు చేసి మెరుగైన ఏఐ శిక్షణకు సహకరించాలని ఇటీవల ట్రంప్ ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదనలో అభ్యర్థించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)