Breaking News

ఓపెన్‌ ఏఐ నుంచి జీపీటీ 5: అందరికీ ఫ్రీ

Published on Sat, 08/09/2025 - 07:14

ప్రస్తుతం అంతర్జాతీయంగా తమకు అతి పెద్ద మార్కెట్లలో రెండో స్థానంలో ఉన్న భారత్‌ త్వరలోనే అగ్ర స్థానానికి చేరుతుందని ఓపెన్‌ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌ తెలిపారు. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత మార్కెట్లో ప్రజలు, వ్యాపార సంస్థలు గణనీయ స్థాయిలో కృత్రిమ మేధను వినియోగిస్తున్నాయని ఆయన వివరించారు.

కొత్త తరం మోడల్‌ జీపీటీ-5ని ఆల్ట్‌మన్‌ ఆవిష్కరించారు. ఇది అందరికీ ఉచితమని వివరించారు. తాము మరిన్ని ఉత్పత్తులను భారత మార్కెట్లో ప్రజలకు ఏఐని మరింతగా అందుబాటులోకి తేవడంపై కసరత్తు చేస్తున్నామని, స్థానిక భాగస్వాములతో కూడా కలిసి పని చేస్తున్నామని ఆల్ట్‌మన్‌ చెప్పారు.

జీపీటీ–5 గురించి వివరిస్తూ, కోడింగ్‌.. ఏజెంటిక్‌ టాస్క్‌లకు ఇప్పటివరకు వచ్చిన మోడల్స్‌లో ఇది అత్యుత్తమమైనదని వివరించారు. డెవలపర్లకు మరింత వెసులుబాటు లభించేలా ఏపీఐలో జీపీటీ–5, జీపీటీ–5–మినీ, జీపీటీ–5–నానో అని మూడు విధాలుగా ఇది అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ట్రాఫిక్‌ సమస్యకు చెక్!.. జపాన్ కంపెనీ వ్యూహం ఇదే..

కొత్త మోడల్‌ 12 భారతీయ భాషలను అర్థం చేసుకోగలుగుతుందని ఆల్ట్‌మన్‌ చెప్పారు. ఉచిత, ప్లస్, ప్రో యూజర్లకు జీపీటీ–5 ఆగస్టు 7 నుంచి అందుబాటులోకి రాగా, ఎంటర్‌ప్రైజ్‌.. ఎడ్యుకేషన్‌ యూజర్ల సెగ్మెంట్‌కు వారం తర్వాత నుంచి లభిస్తుందని వివరించారు.    

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)