ఇవేం లేఆఫ్‌లు? జాబ్‌ ఉండదు.. జీతమొస్తుంది!

Published on Thu, 11/19/2026 - 19:55

అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ సేల్స్‌ఫోర్స్‌ (Salesforce) మరోసారి ఉద్యోగుల తొలగింపులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఈ తాజా కోతల ప్రభావం భారత్‌లోని ఉద్యోగులపైనా పడినట్లు తెలుస్తోంది. ఉద్యోగాలు కోల్పోయిన కొందరు సిబ్బంది తమ అనుభవాలను అనామక ఉద్యోగుల వేదిక బ్లైండ్‌ (Blind)లో పంచుకున్నారు. వారికి గార్డెన్‌ లీవ్‌తో పాటు అదనపు పరిహారం కూడా అందించే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.

బ్లైండ్‌లో సేల్స్‌ఫోర్స్‌ ఇండియా ఉద్యోగిగా చెప్పుకున్న ఓ వ్యక్తి తన ఉద్యోగం కోల్పోయినట్లు పోస్టు చేశారు. కంపెనీ ఉద్యోగుల సంబంధాల విభాగం నుంచి క్యాలెండర్‌ ఆహ్వానం అందిన అనంతరం మేనేజర్‌, హెచ్‌ఆర్‌తో జరిగిన సమావేశంలో ఈ విషయం వెల్లడించారని తెలిపారు. తనకు 2027 ఫిబ్రవరి 1 వరకు గార్డెన్‌ లీవ్‌ వర్తిస్తుందని పేర్కొన్నారు.

గార్డెన్‌ లీవ్‌ అంటే ఏమిటి?

ఉద్యోగిని విధులకు హాజరుకావద్దని చెప్పినప్పటికీ, నోటీసు వ్యవధిలో కంపెనీ పేరోల్‌లో కొనసాగిస్తూ జీతం, వర్తించే ప్రయోజనాలు అందించే విధానాన్ని గార్డెన్‌ లీవ్‌ అంటారు. ఈ సమయంలో ఉద్యోగి రోజువారీ విధులు నిర్వహించాల్సిన అవసరం ఉండదు.

21 వారాల వరకు పరిహారం?

సేల్స్‌ఫోర్స్‌ ఉద్యోగుల తొలగింపులపై బ్లైండ్‌లో మరో ఉద్యోగి చేసిన పోస్టు కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రభావిత ఉద్యోగులకు సుమారు రెండు నెలల గార్డెన్‌ లీవ్‌తో పాటు, వారి ఉద్యోగ అనుభవం (టెన్యూర్‌), పనిచేసే ప్రాంతాన్ని బట్టి అదనపు వారాల జీతం అందించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కొందరికి సుమారు 21 వారాల వేతనానికి సమానమైన ప్యాకేజీ లభించవచ్చని వెల్లడించారు.

అయితే, ఈ పరిహార వివరాలు ఉద్యోగులు బ్లైండ్‌లో పంచుకున్న సమాచారమే. వీటిని కంపెనీ అధికారికంగా ధ్రువీకరించలేదు. భారత్‌లో ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయారు? ఏయే విభాగాలపై ప్రభావం పడింది? అనే వివరాలు కూడా ఇంకా వెల్లడికాలేదు.

ఇదీ చదవండి: ఎంబీఏ విద్యార్థులు ఏఐ నేర్చుకోవాల్సిందేనా?

Videos

భారీగా పెరిగిన బిర్యానీ ధరలు.. ఎంత పెరిగిందంటే? కారణం ఇదే!

నంద్యాలలో MPP సీట్లు గెలుచుకున్న వైఎస్సార్‌సీపీ

ఆ ఇద్దరూ కలసి కోట్లు కొట్టేయడానికి స్కెచ్ వేశారు..? కట్ చేస్తే..!

IMD హెచ్చరిక.. ఆ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్

మునగపాక ఎంపీపీ పదవి YSRCP కైవసం

కొట్టేది ఆయనే.. ఏడ్చేది ఆయనే.. కోయ ప్రవీణ్ పై అవినాష్ రెడ్డి సెటైర్లు

శిల్పా చక్రపాణి రెడ్డి అరెస్ట్

Viral: మిసిసిపి నదిలో భారీ ప్రమాదం.. బోల్తా పడిన పర్యాటక నౌక..

ఒక్కడే వచ్చి మూడు షాపులు లూటీ! CCTVలో షాకింగ్ దృశ్యాలు

YSRCP గెలుపు జీర్ణించుకోలేక టీడీపీ నేతల దౌర్జన్యం

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఘనంగా మహిళా దినోత్సవం..ముఖ్య అతిథిగా నటి రష్మిక (ఫోటోలు)

+5

స్టేజీ షో.. అభినయంతో అదరగొట్టేసిన సంయుక్త (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో కన్నడ హీరోయిన్లు (ఫొటోలు)

+5

‍అనిరుధ్-కావ్య పెళ్లిలో ఫుల్ హంగామా (ఫొటోలు)

+5

'ఆకాశంలో ఒక తార'.. అందంగా సాత్విక (ఫొటోలు)

+5

కూతురితో శ్రియ క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ చిలుకలా మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

కొల్లేరులో శీతాకాలంలో విడిది పక్షుల సందడి (ఫోటోలు)

+5

అనంతపురం : పులకించిన పుట్టపర్తి (ఫోటోలు)