Breaking News

నిరాశపర్చిన ఈ–టూవీలర్స్‌ విక్రయాలు..

Published on Mon, 05/06/2024 - 09:25

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన విక్రయాలు ఏప్రిల్‌ నెలలో నిరాశపరిచాయి. దేశవ్యాప్తంగా మార్చి నెలలో 1,37,146 యూనిట్లు రోడ్డెక్కితే.. గత నెలలో ఈ సంఖ్య సగానికంటే క్షీణించి 64,013 యూనిట్లకు పరిమితమైంది. సబ్సిడీ మొత్తం తగ్గడం, కొన్ని ప్రముఖ మోడళ్ల ధర పెరగడం ఈ క్షీణతకు కారణం.

ఎన్నికల సీజన్‌ కావడం కూడా ప్రభావం చూపిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. 2023 ఏప్రిల్‌లో కస్టమర్ల చేతుల్లోకి వెళ్లిన ఈ–టూవీలర్ల సంఖ్య 66,873 యూనిట్లు. 2024 జనవరి, ఫిబ్రవరిలో ప్రతినెలా 82 వేల యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ఫేమ్‌–2 సబ్సిడీ అందుకోవడానికి మార్చి నెల చివరిది కావడం కూడా 1,37,146 యూనిట్ల గరిష్ట అమ్మకాలకు దోహదం చేసింది.

కంపెనీలు మోడల్‌నుబట్టి రూ.4,000లతో మొదలుకుని రూ.16,000 వరకు ధరలను పెంచడం గమనార్హం. అయితే నూతన ఎలక్ట్రిక్‌ మొబిలిటీ ప్రమోషన్‌ స్కీమ్‌ 2024 ఏప్రిల్‌ 1 నుంచి జూలై 31 వరకు అమలులో ఉంటుంది. ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనానికి గరిష్టంగా రూ.10,000, ఈ–రిక్షా, ఈ–కార్ట్‌కు రూ.25,000, ఈ–ఆటోకు రూ.50,000 సబ్సిడీ ఆఫర్‌ చేస్తారు. ఇక ఏప్రిల్‌లో ఈ–టూ వీలర్ల విక్రయాల్లో ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్‌ మోటార్‌ కో, బజాజ్‌ ఆటో, ఏథర్‌ ఎనర్జీ, గ్రీవ్స్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ టాప్‌లో నిలిచాయి.

ఇవి చదవండి: అధిక రాబడులకు మూమెంటమ్ ఇన్వెస్టింగ్..

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)