రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్
Breaking News
సాక్షి మనీ మంత్రా: బ్యాంకింగ్ దెబ్బ, ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్
Published on Wed, 08/30/2023 - 15:41
Today StockMarket Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిసాయి. రోజంతా ఒడిదుడులకు మధ్య సాగిన సూచీలు చివరికి ఫ్లాట్‌గా ముగిసాయి. సెన్సెక్స్ 11 పాయింట్ల లాభంతో 650,87వద్ద, నిఫ్టీ 5 పాయింట్ల లాభాలకు పరిమితమై 19,347 వద్ద ముగిసింది. తద్వారా నిఫ్టీ 19400 దిగువకు చేరింది.
రియల్టీ ఇండెక్స్ 1 శాతం, ఆటో, ఎఫ్‌ఎంసిజి, ఐటీ మెటల్ 0.5 శాతం పెరిగాయి. మరోవైపు, పవర్, ఆయిల్ & గ్యాస్ ,బ్యాంకింగ్ రంగ షేర్లు 0.5 శాతం తగ్గాయి. టాటా స్టీల్, మారుతి సుజుకి, ఎం అండ్ ఎం, ఐషర్ మోటార్స్, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్‌గాఉన్నాయి. మరోవైపు పవర్ గ్రిడ్, బీపీసీఎల్, డా. రెడ్డీస్, హీరోమోటోకార్ప్ భారీ నష్టాల్ని ఎదుర్కొన్నాయి.
రూపాయి: డాలరు మారకంలో దేశీయ కరెన్సీ కూడా నష్టపోయింది. మంగళవారం నాటి ముగింపు 82.70తో పోలిస్తే బుధవారం రూపాయి 82.73 వద్ద స్థిరపడింది.
Tags : 1