Breaking News

సాక్షి మనీ మంత్ర: ఐటీ జోరు, కోలుకున్న సూచీలు 

Published on Mon, 08/14/2023 - 15:56

దేశీయస్టాక్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిసాయి. ఆరంభంలోనే భారీ నష్టాలతో  ఉన్నప్పటికీ   తీవ్ర ఒడిదుడుకుల మధ్య ముగింపులో కోలుకున్నాయి. చివరికి  సెన్సెక్స్ 79   పాయింట్ల లాభంతో  65,401.92 వద్ద, నిఫ్టీ 6 పాయింట్లు లాభంతో 19,434 వద్ద  ముగిసాయి. దాదాపు 1509 షేర్లు పురోగమించగా, 2101 షేర్లు క్షీణించాయి. 

నిఫ్టీలో ఎల్‌టిఐఎండ్‌ట్రీ, దివీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్, హెచ్‌యుఎల్, రిలయన్స్ ప్రధానంగా  లాభాలను ఆర్జించగా, నష్టపోయిన వాటిలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్,  ఎస్‌బీఐ, టాటా స్టీల్ ఉన్నాయి.

ఐటీ, ఎఫ్‌ఎంసిజి మినహా మిగిలిన అన్ని సూచీలు మెటల్ ఇండెక్స్ దాదాపు 2 శాతం నష్టపోయాయి. పవర్, రియాల్టీ , సీఎస్‌యు బ్యాంక్ 0.5 శాతం చొప్పున క్షీణించాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 0.5 శాతం చొప్పున క్షీణించాయి.

అటు డాలరు మారకంలో రూపాయి సోమవారం  నష్టపోయింది.  శుక్రవారం నాటి  82.85  ముగింపుతోపోలిస్తే  82.95 వద్ద ముగిసింది.బలహీన దేశీయ మార్కెట్లు బలమైన డాలర్ కారణంగా భారత రూపాయి తాజా 10 నెలల కనిష్టానికి పడిపోయింది.  బలహీనమైన ఐఐపీ  గ్రోత్‌    కూడా  ప్రభావం చూపింది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)