Breaking News

భారత్‌కు రేటింగ్‌ బూస్ట్‌

Published on Fri, 08/15/2025 - 04:47

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు, ద్రవ్యలోటు కట్టడి విషయంలో ప్రభుత్వ క్రమశిక్షణను ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ గుర్తించింది. ద్రవ్యోల్బణ నియంత్రణ అనుకూల పరపతి విధానాలనూ పరిగణనలోకి తీసుకుంటూ.. భారత సార్వబౌమ రేటింగ్‌ను బీబీబీ మైనస్‌ నుంచి ‘బీబీబీ’ స్టేబుల్‌ అవుట్‌లుక్‌ (స్థిరమైన దృక్పథం)కు అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. 

భారత ఆర్థిక వ్యవస్థను నిర్జీవమైనదంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆరోపించిన కొన్ని రొజులకే.. ఎస్‌అండ్‌పీ తన చర్యతో అసలు నిజమేంటో నిరూపించింది. 18 ఏళ్ల విరామం తర్వాత భారత రేటింగ్‌ను ఎస్‌అండ్‌పీ అప్‌గ్రేడ్‌ చేయడం గమనార్హం. 2007 జనవరిలో భారత సావరీన్‌ రేటింగ్‌ను బీబీబీ మైనస్‌ (అతి తక్కువ పెట్టుబడుల గ్రేడ్‌)కు తగ్గిస్తూ ఎస్‌అండ్‌పీ నిర్ణయం ప్రకటించింది. ఆ తర్వాత రేటింగ్‌ సవరణ మళ్లీ ఇదే. 

గతేడాది మే నెలలో భారత క్రెడిట్‌ రేటింగ్‌ అవుట్‌లుక్‌ను స్థిరత్వం నుంచి సానుకూలానికి మారుస్తూ.. వచ్చే 24 నెలల్లో రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ ఉండొచ్చంటూ సంకేతం పంపింది.  దీర్ఘకాల అన్‌సాలిసైటెడ్‌ (స్వచ్ఛంద) సావరీన్‌ క్రెడిట్‌ రేటింగ్స్‌ను బీబీబీ మైనస్‌ నుంచి బీబీబీకి.. స్వల్పకాల రేటింగ్స్‌ను ఏ–3 నుంచి ఏ–2కు ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ అప్‌గ్రేడ్‌ చేసింది. దీనివల్ల భారత కంపెనీలు మరింత తక్కువ రేట్లపై అంతర్జాతీయ మార్కెట్ల నుంచి నిధులు సమీకరించే వెసులుబాటు లభిస్తుంది. బీబీబీ అన్నది ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌ రేటింగ్‌. తన రుణాలను సౌకర్యవంతంగానే చెల్లించగలదని ఇది సూచిస్తుంది.  

ప్రపంచంలో అత్యుత్తమ పనితీరు 
‘‘ప్రపంచంలో అత్యుత్తమ ఆర్థిక పనితీరు చూపుతున్న దేశాల్లో భారత్‌ ఇక ముందూ తప్పకుండా ఉంటుంది. ప్రభుత్వ వ్యయాల తీరు గత ఐదారేళ్ల కాలంలో మెరుగుపడింది. అమెరికా టారిఫ్‌ల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం ఎదుర్కోతగినదే. 50% టారిఫ్‌ల విధింపు వృద్ధిని ఏమంత కిందకు తోసేయదు. వాణిజ్య ఎగుమతులపై భారత్‌ తక్కువగా ఆధారపడి ఉన్నది. 60% ఆర్థిక వృద్ధి దేశీ వినియోగం రూపంలోనే ఉంటోంది’’ అని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ తెలిపింది. ఆర్థిక వృద్ధి సరైన దిశలోనే ఉన్నందున ద్రవ్య స్థిరీకరణకు మరింత నిర్దిష్టమైన మార్గాన్ని రూపొందించుకోవాలని సూచించింది.

ఇక ముందూ ఇదే ఒరవడి..: ఆర్థిక శాఖ 
ప్రధాని మోదీ నాయకత్వంలో భారత ఆర్థిక వ్యవస్థ చురుగ్గా, చైతన్యంగా, బలంగా ఉందని రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ రుజువు చేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఒకవైపు మౌలిక వసతుల కల్పన, సమ్మిళిత ఆర్థిక వృద్ధిని కొనసాగిస్తూ, మరోవైపు ద్రవ్య స్థిరీకరణకు భారత్‌ ప్రాధాన్యం ఇచి్చందని, దీని ఫలితమే రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ అంటూ ఎక్స్‌ 
ప్లాట్‌ఫామ్‌పై పేర్కొంది. చురుకైన ఈ వృద్ధిని భారత్‌ ఇక ముందూ కొనసాగిస్తూ, 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యం సాధించేందుకు వీలుగా అవసరమైన సంస్కరణలు చేపడుతుందని తెలిపింది.  

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)