Breaking News

పెంచిన జీతం వెనక్కి ఇవ్వండి: ప్రముఖ కంపెనీ ఆదేశం

Published on Sun, 05/25/2025 - 21:14

ఎక్కడైనా ఉద్యోగులకు జీతాలు పెంచితే సంబరపడిపోతారు. అయితే పెంచిన జీతాన్ని.. తిరిగి ఇచ్చేయమంటే?, వినటానికి వింతగా, కష్టంగా అనిపించినా.. ప్రముఖ ఐరిష్ విమానయాన సంస్థ 'ర్యాన్‌ఎయిర్‌' (Ryanair) ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ వివరంగా చూసేద్దాం..

ర్యాన్‌ఎయిర్‌ సంస్థ.. పెంచిన జీతాలను తిరిగి ఇచ్చేయాలని ఆదేశించడంతో ఉద్యోగులు ఖంగుతిన్నారు. జీతాల పెంపు తరువాత ఒక్కో ఉద్యోగి 3400 డాలర్లు (రూ. 2.9 లక్షలు) అందుకున్నారు. ఆ మొత్తాన్ని తిరిగి కంపెనీ ఖాతాలో జమ చేయాలని, లేకుంటే.. ప్రతి నెలా జీతంలో కోతలు విధించాల్సి ఉంటుందని వెల్లడించింది.

నిజానికి ర్యాన్‌ఎయిర్‌ ఉద్యోగులకు సంబంధించి.. సీసీఓఓ (CCOO), యూఎస్ఓ (USO) అనే రెండు ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. వేతనాల పెంపుకు సంబంధించిన సీసీఓఓతో మాట్లాడి.. జీతాలను పెంచింది. కానీ ఈ నిర్ణయంపై యూఎస్ఓ.. కోర్టు మెట్లు ఎక్కింది. జీతాల పెంపు విషయంలో ర్యాన్‌ఎయిర్‌.. 'సీసీఓఓ'తో చేసుకున్న ఒప్పందం కుదరదని కోర్టు తీరునిచ్చింది. దీంతో చేసేదేమీ లేక కంపెనీ ఉద్యోగులకు నోటీసులు పంపిస్తూ.. పెంచిన జీతాలను తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది.

ఇదీ చదవండి: 'డబ్బు ఆదా చేయొద్దు.. పేదవారవుతారు': రాబర్ట్ కియోసాకి

కంపెనీ చర్యలపై న్యాయపోరాటం చేస్తామని.. కార్మిక సంఘం ప్రతినిధి 'ఎస్టర్ పెయ్రో గాల్డ్రాన్' పేర్కొన్నారు. అయితే.. ర్యాన్‌ఎయిర్‌ మాత్రం కోర్టు తీర్పుకు కట్టుబడి ఉన్నామని, ఆ తీరు కారణంగానే నోటీసులు జరీ చేయాల్సి వచ్చిందని పేర్కొంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)